Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

హ్యాపీ మదర్స్ డే: కనీసం ఒకరోజైనా ఆమె కోసం కేటాయించండి..

Mother's Day
, శనివారం, 7 మే 2022 (22:24 IST)
Mother's Day
త్యాగానికి చిరునామా అమ్మ. కనిపించే దైవం అమ్మ. అంతులేని ప్రేమానురాగాలకు ఆప్యాయతలకు అమ్మ ప్రత్యక్ష దైవం అని చెప్పొచ్చు. అలాంటి అమ్మను ఆరాధించడం కోసం ఆమె పట్ల ఆప్యాయతను ప్రదర్శించడం కోసం మాతృదినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. 
 
అంతర్జాతీయ మాతృదినోత్సవం అదే 'మదర్స్ డే' మే 8న వస్తోంది. మనదేశంలో ప్రతీ ఏటా మే రెండో ఆదివారాన్ని మదర్స్ డేగా జరుపుకుంటారు. మదర్స్ డే తొలిసారిగా అమెరికాలో 1907లో జరుపుకున్నట్లు చెబుతారు. అన్నా జార్విష్ అనే మహిళ తన తల్లి జ్ఞాపకార్థం వెస్ట్ వర్జినియాలో నిర్మించిన మెమోరియల్ వద్ద మదర్స్ డే నిర్వహించారని... ఇదే తొలి మదర్స్ డే అని పరిగణింపబడుతోంది. 
 
అంతకుముందు, 1905లోనే మదర్స్ డేని అధికారిక సెలవు దినంగా గుర్తించాలని జార్విస్ పెద్ద ఎత్తున క్యాంపెయిన్ నిర్వహించారు. అప్పట్లోనే ప్రజల ఆరోగ్య సమస్యలను నయం చేసేందుకు ఆమె మదర్స్ డే వర్క్ క్లబ్స్‌ను ఏర్పాటు చేశారు. 
 
సివిల్ వార్‌లో గాయాలపాలైన సైనికులకు సేవలందించారు. అన్నా జార్విష్‌తో పాటు జూలియవర్డ్ అనే మరో యాక్టివిస్ట్ అప్పట్లో 'మదర్స్ డే ఫర్ పీస్' అనే క్యాంపెయిన్‌ను చేపట్టారు. 
 
ఈ రోజునే కాలక్రమేణా జన్మనిచ్చిన తల్లులకు కృతజ్ఞతలు తెలిపేందుకు... వారి పట్ల ప్రేమను చాటేందుకు ఇది ప్రత్యేకమైన రోజుగా భావిస్తారు. తల్లుల పట్ల ప్రేమను ఒక రోజుకే పరిమితం చేయడమని కాదు కానీ... కనీసం ఒకరోజైనా వారి కోసం ప్రత్యేకంగా కేటాయించేందుకే మదర్స్ డేని జరుపుకుంటారు. 
 
ప్రతి ఒక్కరు కూడా కన్న తల్లిని గౌరవించాలి. ప్రతి రోజూ అమ్మని ప్రేమించాలి. అమ్మ చేసిన త్యాగాన్ని గుర్తించాలి. ప్రపంచంలోనే అతి పేద వాడు ధనం లేని వాడు కాదు అమ్మ ప్రేమ లేని వాడే ప్రపంచంలో అతి పేద వాడు. అందుచేత అమ్మ పట్ల ప్రేమను, ఆప్యాయతను పంచాలని ఆశిస్తూ.. అమ్మలందరికీ వరల్డ్ మదర్స్ డే విషెస్.. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఉగ్రవాదులకు ఆ వసతులు కల్పిస్తున్న పాక్ ఆర్మీ: ఉపేంద్ర