Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ఎన్‌జీవో నిర్మాణ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఇనార్బిట్‌ హైదరాబాద్‌

అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేళ ఎన్‌జీవో నిర్మాణ్‌తో భాగస్వామ్యం చేసుకున్న ఇనార్బిట్‌ హైదరాబాద్‌
, బుధవారం, 9 మార్చి 2022 (23:16 IST)
ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎన్‌జీవో నిర్మాణ్‌తో భాగస్వామ్యం చేసుకుని మహిళా సాధికారితను వేడుక చేసింది. ఇనార్బిట్‌ మాల్‌ హైదరాబాద్‌ వద్ద నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ వేడుకలలో నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ ఫౌండర్‌ అండ్‌ సీఈఓ మయూర్‌ పట్నాల మరియు ఇనార్బిట్‌మాల్‌ హైదరాబాద్‌ సెంటర్‌ హెడ్‌ శరత్‌ బెలావడీ  పాల్గొన్నారు. కార్యక్రమంలో భాగంగా వీరు నిరుపేద మహిళలను, దివ్యాంగులను సత్కరించారు. తద్వారావారు స్వీయ సమృద్ధి మరియు ఆర్థిక స్వేచ్ఛను అనుభవించేలా ప్రోత్సహించారు.

 
నిర్మాణ్‌ ఆర్గనైజేషన్‌ను 2005లో రాజస్తాన్‌లోని పిలానీలో ఉన్న బిర్లా ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌‌కు చెందిన కొంతమంది విద్యార్థులు ప్రారంభించారు. అప్పటి నుంచి, ఈ ఎన్‌జీవో తమ రెక్కలను విస్తరిస్తూ తమ ప్రాజెక్టులను  హైదరాబాద్‌, పిలానీ , గోవా , ముంబై, బెంగళూరు, విజయనగరంలలో నిర్వహిస్తోంది. ఆర్ధికంగా వెనుకబడిన వర్గాల ప్రజలకు విద్య మరియు ఉపాధి అవకాశాలను ఇది అందించడంపై దృష్టి సారించింది.

 
‘‘పలు కార్యక్రమాల కోసం మేము నిర్మాణ్‌ ఎన్‌జీవోతో భాగస్వామ్యం చేసుకున్నాము. కానీ, స్వీయ సమృద్ధి మరియు  ఆర్థిక స్వేచ్ఛ ద్వారా మహిళా సాధికారిత సందేశాన్ని వ్యాప్తి చెందడంలో భాగంగా అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని వేడుక చేసే వేదికను ఎన్‌జీవోకు అందించడాన్ని ఓ గౌరవంగా భావిస్తున్నాము. ఈ ఎన్‌జీవోకు ఓ వేదికను అందించాలనే మా లక్ష్యం కారణంగా వారు విస్తృత శ్రేణిలో ప్రజలను చేరుకుంటున్నారు. తద్వారా అల్పాదాయ వర్గాల మహిళలు మరియు వారి కుటుంబాలకు ఆర్థిక స్థితిని వృద్ధి చేయడంలో సహాయపడటమూ సాధ్యమవుతుంది’’ అని శరత్‌ బెలావడీ, సెంటర్‌ హెడ్‌, ఇనార్బిట్‌ మాల్‌ , హైదరాబాద్‌ అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

పంది గుండెను అమర్చుకున్న వ్యక్తి మృతి.. ఏమైందంటే?