Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఈ ఫోటోను చూసి మీరు ఏమంటారు? నా డాక్యుమెంటరీలో లేదు.. లీలా మణిమేగలై

Lord Shiva-Parvati
, శుక్రవారం, 8 జులై 2022 (10:39 IST)
Lord Shiva-Parvati
డాక్యుమెంటరీ ఫిల్మ్ డైరెక్టర్ లీలా మణిమేగలై మళ్లీ వార్తల్లో నిలిచింది. కాళీ వివాదం విషయంలో తనపై పలు కేసులు నమోదైన నేపథ్యంలో.. తాజా పోస్ట్‌తో లీనా తన వాదనను సమర్థించుకునేయత్నం చేసింది.
 
తమిళనాడు రాష్ట్రంలోని మదురైకి చెందిన లీనా మణిమేగలై.. 'రిథమ్స్‌ ఆఫ్‌ కెనడా'లో భాగంగా 'కాళీ' పేరుతో ఓ డాక్యుమెంటరీ చిత్రీకరించారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కెనడాలోని టొరంటోలోని ఉన్న అగాఖాన్‌ మ్యూజియంలో విడుదల చేశారు. 
 
అయితే, ఆ పోస్టర్‌ దేవతా మూర్తిని కించపరిచేలా ఉందని ఆరోపిస్తూ భారత్‌లో నిరసనలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అందులోకి కాళీ చేతిలో సిగరెట్‌ కన్పించడం, వెనుకవైపు స్వలింగ సంపర్కుల జెండా వంటివి తీవ్ర వివాదానికి దారితీశాయి.
 
ఈ క్రమంలోనే ఆమె చేసిన పోస్ట్‌ మత విశ్వాసాలను దెబ్బతీసేలా ఉందంటూ పలు రాష్ట్రాల్లో కేసులు నమోదయ్యాయి. అటు కెనడాలోని భారత హైకమిషన్‌ కూడా దీన్ని తీవ్రంగా పరిగణించింది. 
 
దీంతో స్పందించిన అగాఖాన్‌ మ్యూజియం.. ఆ డాక్యుమెంటరీని ప్రదర్శన నుంచి తొలగించింది. అటు ట్విటర్‌ కూడా లీనా పోస్టర్‌ను తొలగించింది. 
 
"జానపద రంగస్థల కళాకారులు తమ ప్రదర్శనలను ఎలా పోస్ట్ చేస్తారో బిజెపి పేరోల్డ్ ట్రోల్ ఆర్మీకి తెలియదు. ఇది నా సినిమా నుంచి వచ్చినది కాదు. ఈ సంఘ్ పరివార్లు తమ అలుపెరగని ద్వేషం మరియు మతపరమైన మతోన్మాదంతో నాశనం చేయాలని కోరుకునే రోజువారీ గ్రామీణ భారతదేశం నుండి ఇది. హిందుత్వ ఎప్పటికీ భారతదేశం కాజాలదు." అంటూ ఆమె పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రయాణికులకు శుభవార్త - నిజామాబాద్ టు తిరుమల డైరెక్ట్ సర్వీస్