14 ఏళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ కేసులో ఫన్ బకెట్ భార్గవ్ పైన పోలీసులు కేసు నమోదు చేసి అతడిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. భార్గవ్ అత్యాచారం చేసిన బాలికకు 14 ఏళ్లు వుంటాయన్న వార్త బయటకు రాగానే చాలామంది 'ఓ మైగాడ్ నిత్య' పేరును చర్చలోకి తీసుకుని వచ్చారు.
భార్గవ్ అత్యాచారానికి పాల్పడ్డ బాలిక ఈ అమ్మాయే అంటూ పలువురు యూ ట్యూబులో వీడియోలు కూడా చేసేశారు. దీనిపై నిత్య స్పందించింది. అసలు భార్గవ్ కి ఆ కేసుకి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. తను హైదరాబాద్ షూటింగులో వున్నానని లొకేషన్ చూపించింది.
చాలామందికి తెలిసినట్లే సోషల్ మీడియా ద్వారా భార్గవ్ కేసు గురించి తనకు తెలిసిందనీ, కొందరు ఈ విషయంపై నాకు మెసేజిలు చేయడంతో నేను మీ ముందుకు వచ్చానని తెలిపింది. ఆ భార్గవ్‌ను కలిసి ఏడాది దాటిపోయిందనీ, అతడితో అసలు తను టచ్‌లో కూడా లేనని, వీడియోలు కూడా చేయడం లేదని వెల్లడించింది. ఇప్పటికైనా యూ ట్యూబులో తన ఫోటోలు పెట్టి వీడియోలు చేసినవాళ్లు వాటిని డిలీట్ చేయాలని కోరింది. ఆ వీడియోలు చేసినవారు తెలియక చేసి వుండొచ్చని, మరో రెండ్రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయని చెప్పింది.