Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆ పాట పెళ్లిని ఆపేసింది.. మాజీ ప్రియురాలు గుర్తుకొచ్చి.. పెళ్లి వద్దనుకున్న వరుడు?

Advertiesment
marriage

సెల్వి

, బుధవారం, 30 ఏప్రియల్ 2025 (16:13 IST)
పెళ్ళిళ్లు ఆగిపోవడాలు వినేవుంటాం. వివాహాలు ఆగిపోవడానికి ఎన్నో కారణాలుంటాయి. అయితే ఢిల్లీలో ఓ వివాహ వేడుకలో మోగిన పాట ఆ పెళ్లిని రద్దు చేసింది. డీజేలో వాయించిన బాలీవుడ్ పాట "చన్నా మేరేయా" విన్న తర్వాత ఒక వరుడు తన వివాహాన్ని రద్దు చేసుకున్నాడు. 
 
ఏ దిల్ హై ముష్కిల్ చిత్రంలోని ఈ పాట తన మాజీ ప్రియురాలి గురించి తీవ్రమైన జ్ఞాపకాలను గుర్తు చేసింది. ఈ పాట ఆ వరుడి పాత జ్ఞాపకాలను గుర్తు చేశాయని.. వెంటనే ఆ పెళ్లిని అక్కడికక్కడే రద్దు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు. 
 
దీంతో 'బరాత్'లో వధువు వరుడు లేకుండా ఇంటికి తిరిగి వెళ్ళింది. ఈ సంఘటన పోస్ట్ చేసిన తర్వాత సోషల్ మీడియాలో త్వరగా వైరల్ అయింది. ఢిల్లీలో జరిగిన ఈ ఘటన ఆన్‌లైన్‌లో లక్షలాది మంది దృష్టిని ఆకర్షించింది. స్పందించిన వారిలో చిత్రనిర్మాత కరణ్ జోహార్ కూడా ఉన్నారు. 
 
ఆయన ఏ దిల్ హై ముష్కిల్ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఒక పాటతో పెళ్లి క్యాన్సిల్ అవడమా అంటూ ఆయనతో పాటు పలువురు నెటిజన్లు షాక్ అవుతున్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Washington: ఆ కుటుంబానికి ఏమైంది..? టెక్కీ కింగ్ అయినా భార్యను, కుమారుడి కాల్చేశాడు.. తర్వాత?