Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

పహల్గాం దాడితో ఆగిన పెళ్లి - భారత భూభాగంలో వరుడు .. పాకిస్థాన్ గ్రామంలో వధువు

Advertiesment
marriage

ఠాగూర్

, శుక్రవారం, 25 ఏప్రియల్ 2025 (16:41 IST)
పహల్గాంలో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు దాడులు జరిపి 26 మంది పర్యాటకులను పొట్టనబెట్టుకున్నారు. దీంతో భారత్, పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ దర్చర్యపై భారత్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ పలు కఠిన చర్యలకు శ్రీకారం చుట్టింది. ఇదిలావుంటే, ఈ దాడి ఘటనతో ఓ యువకుడి పెళ్లి ఆగిపోయింది. దీనికి కారణం ఇండో పాక్ సరిహద్దులకు ఇటువైపు వరుడు, సరిహద్దుకు అటువైపు వధువు ఉండిపోవడమే. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన సైతాన్ సింగ్ అనే యువకుడు తన వివాహం కోసం పాకిస్థాన్ వెళ్లాల్సి ఉండగా, సరిహద్దు మూసివేతతో మొత్తం తలకిందులైంది. 
 
సైతాన్ సింగ్‌కు పాకిస్థాన్‌లో నివశించే ఓ యువతితో వివాహం నిశ్చమైంది. ఇరు కుటుంబాల సభ్యులు పెళ్లి ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. వరుడు తరపు బంధువుల్లో కొందరు ఇప్పటికే వివాహం కోసం పాకిస్థాన్ చేరుకున్నారు. అంతా సవ్యంగా సాగుతోందనుకున్న తరుణంలో పహల్గాంలో ఉగ్రవాదులు ఘాతుకానికి తెగబడ్డారు. దీంతో పాకిస్థాన్‌లోని వధువు ఇంటికి వెళ్లే మార్గం సైతాన్ సింగ్‌కు మూసుకుపోయింది. దీంతో అతడు తీవ్ర నిరాశకు లోనయ్యాడు. 
 
ఏఎన్ఐ వార్తా సంస్థతో మాట్లాడుతూ, ఉగ్రవాదులు చేసింది చాలా తప్పు. సరిహద్దు మూసివేయడంతో మమ్మల్ని పాకిస్థాన్‌కు వెళ్లేందుకు అనుమతించడం లేదు. ఇపుడు ఏం జరుగుతుందో చూడాలి అని తన ఆవేదన వ్యక్తం చేశాడు. నిర్ణీత ముహూర్తానికి పెళ్లి ప్రాంగణానికి చేసుకోవాల్సిన తాము ఇలాంటి ఊహించని అడ్డంకితో ఆగిపోయామని చెప్పారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Asaduddin Owaisi: పహల్గాం ఉగ్రదాడికి నిరసనగా హైదరాబాదులో ముస్లింల నిరసన (video)