చేపలు నీటిలోనే వుంటాయి. కానీ కొన్ని జాతుల చేపలు ఎగురుతాయంటే మీరు నమ్ముతారా? ఫ్లయింగ్ కాడ్ అనే చేపలు నీటి నుంచి బయటకు వచ్చి.. గాలిలో ఎగురుతాయి. ఏదో నీటి ఉపరితలం మీదు ఒకటి రెండు అడగులులు ఎగురుతాయనుకుంటే పొరపాటే. ఎగిరే చేపల శరీరంపై నీలం, నలుపు, తెలుపు, వెండి రంగులు ఉంటాయి.
ఇవి వందల అడుగుల వరకు గాలిలో ఎగరగలవు. వీటికి పక్షుల్లానే రెక్కలుంటాయి. ఇతర చేపల కంటే భిన్నంగా ఉండే ఈ రెక్కల సాయంతో.. చాలా దూరం వరకు చేపలు ఎగురుతాయి. ఈ ఫ్లైయింగ్ చేపలకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
తిమింగలం వేటాడడానికి వచ్చినప్పుడు ఈ చేపలు నీటి నుంచి బయటకు వచ్చి గాలిలోకి ఎగురుగుతున్నాయి. రెక్కలను ఆడిస్తూ.. గాల్లోకి ఎగురుతున్న ఆ వీడియో అద్భుతంగా ఉంది.