హైదరాబాద్ నగరంలోని హోటల్స్‌పై ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇంత పగడ్బందీగా తనిఖీలు చేస్తున్నా కొంతమంది హోటల్స్ నిర్వహకుల్లో ఎలాంటి మార్పు కనిపించడం లేదు. హైదరాబాద్‌లో ఇటీవల నుంచి ఫుడ్ సేఫ్టీ అధికారులు రెస్టారెంట్లు, ఇతర హోటళ్లపై తనిఖీలు చేపడుతున్నారు.
చాలా హోటళ్లలను అపరిశుభ్రంగా ఉన్న పదార్థాలు, చెడిపోయిన పదార్థాలు వెలుగు చూడటంతో అధికారులు కేసులు నమోదు చేస్తున్నారు. హోటళ్లను సీజ్ చేస్తున్నారు. అయినా ఫలితం లేదు. ఇప్పటికే హైదరాబాద్ హోటళ్లలోని బిర్యానీల్లో నాణ్యత తగ్గిందనే టాక్ వస్తోంది. బిర్యానీల్లో జెర్రిలు, బొద్దింకలు కనిపించిన దాఖలాలు వున్నాయి.
తాజాగా అలాంటి ఘటనే మళ్లీ వెలుగులోకి వచ్చింది. హైదరాబాద్ - కొత్తపేట కృతుంగ రెస్టారెంట్ బిర్యానీలో బొద్దింక కనిపించింది. ఇదేంటని అడిగితే హోటల్ సిబ్బంది నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో కస్టమర్లు ఆందోళనకు దిగారు. ఇంకా యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.