గత 20 ఏళ్లలో తొలిసారిగా తెలంగాణలో అత్యంత బలమైన భూకంపం సంభవించింది. ములుగు వద్ద 5.3 తీవ్రతతో భూకంపం సంభవించింది. హైదరాబాద్‌తో సహా తెలంగాణ మొత్తం ప్రకంపనలు సృష్టించింది. గోదావరి నదీగర్భంలో మరోసారి భూకంపం వచ్చినప్పటికీ బలమైన భూప్రకంనలు వచ్చాయి.
చరిత్రలో హైదరాబాద్, ఆ చుట్టుపక్కల భూకంపాలను లెక్కలోకి తీసుకుంటే, ములుగు జిల్లాలో వచ్చినదే పెద్ద భూకంపం అంటున్నారు నిపుణులు. భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైంది.
ఇదే విధంగా.. 1993, సెప్టెంబర్ 30న తెల్లవారుజామున 3.55 గంటలకు హైదరాబాద్‌కి దగ్గర్లో భారీ భూకంపం ఏర్పడింది. అది హైదరాబాద్‌కి తూర్పు-ఈశాన్య దిశలో 226 కిలోమీటర్ల దూరంలో వచ్చింది. గత 124 సంవత్సరాలలో హైదరాబాద్ సమీపంలో సంభవించిన అత్యంత బలమైన భూకంపం అదే. హైదరాబాద్‌కి దగ్గర్లో గత పదేళ్లలో వచ్చిన భూకంపాల్లో ఒకటి 2020 ఏప్రిల్ 24న ఆసిఫాబాద్‌లో వచ్చింది. రిక్టర్ స్కేలుపై దాని తీవ్రత 4.8గా నమోదైంది.
ఇలా ఈ భూకంపాలన్నీ హైదరాబాద్ చుటుపక్కల వచ్చాయే తప్ప హైదరాబాద్‌లో రాలేదు. మరింతగా పర్యావరణ వినాశనం జరగకుండా చూసుకుంటే, ఇలాంటి తీవ్ర పరిస్థితులు రావు అని నిపుణులు సూచిస్తున్నారు.