Publish Date: Wed, 17 Feb 2021 (19:21 IST)
Updated Date: Wed, 17 Feb 2021 (19:23 IST)
ఎంఎస్ ధోనీ చిత్రంలో నటించిన సహ నటుడు సందీప్ ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ కేసులో అతడి భార్యతో పాటు అత్తపై ఎఫ్ఐఆర్ నమోదు చేసారు. ఐతే తన భార్య కాంచనపై ఎలాంటి కేసు నమోదు చేయవద్దని పేర్కొన్నాడు. కానీ తన భార్య ప్రవర్తన, ఇండస్ట్రీలో రాజకీయాలతో విసిగిపోయి ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు.
సూసైడ్ నోట్ లో ఏమున్నదంటే... నా భార్యతో నాకు విభేదాలున్నాయి. నా జీవితంలో ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్నాను. కానీ నా భార్యతో మాత్రం వేగలేకపోతున్నాను. ఆమె ఛీత్కారాలు, చీవాట్లు భరించడం నా వల్ల కావడంలేదు.
ఆమె కోపిష్టి. ఆమె స్వభావం అంతే. ఐతే ఎంతకాలం అని ఆమెతో చీవాట్లు, అపహాస్యాలు భరించాలి. నా వల్ల కావడంలేదు. రోజూ ఉదయం సాయంత్రం ఆమెతో పోట్లాడుతూ కూర్చోవడం నావల్ల కాదు. అందుకే ఇక చనిపోవడమే పరిష్కారమని భావించి ఈ నిర్ణయం తీసుకుంటున్నా" అని పేర్కొన్నాడు.