Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Monday, 13 January 2025
webdunia

ఒమిక్రాన్‌ను వదలగొడతా, భయం వద్దు మందు ఉందంటున్న ఆనందయ్య

Advertiesment
ఒమిక్రాన్‌ను వదలగొడతా, భయం వద్దు మందు ఉందంటున్న ఆనందయ్య
, బుధవారం, 22 డిశెంబరు 2021 (15:56 IST)
ఒక్క ఆనందయ్య మందుతో కోవిడ్ పేషెంట్ లేచి కూర్చున్నాడు. ఇదంతా చాలామందికి తెలిసిన విషయమే. ఇంగ్లీషు మందులను నమ్ముకోలేని పరిస్థితుల్లో ఉన్న కోవిడ్ పేషెంట్లకు ఆనందయ్య మందు ఒక ఔషధంలా పనిచేసింది. ఆయుర్వేద మందు అయినా సరే ఎక్కడెక్కడి నుంచో వచ్చి మరీ మందును తీసుకెళ్ళారు.

 
కోవిడ్ కేసులు తగ్గినా ఇప్పుడు తాజాగా ఒమిక్రాన్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్ లోను ఒమిక్రాన్ కేసులు నమోదు అవుతూ ఉండటం ఆందోళన కలిగిస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా ఆనందయ్య ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 

 
ఒమిక్రాన్ పై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. 15 రోజులకు ఒకసారి మందులు వాడితే చాలు. ఒమిక్రాన్ ఈ చలికాలంలోనె ఎక్కువగా ప్రబలే అవకాశం ఉంది. కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. 

 
అంతేకాదు వేరే వ్యాధులు రాకుండా మందులు వెంటవెంటనే వాడాలంటున్నారు ఆనందయ్య. ఏమాత్రం నిర్లక్ష్యం వహించవద్దంటున్నారు. త్వరలో క్రిష్ణపట్నం, విశాఖలలో మందుల పంపిణీ జరుగుతుందని.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఏపీలో 15 థియేటర్లు సీజ్.. ఎందుకో తెలుసా?