Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఒమిక్రాన్ వైరస్‌ అలెర్ట్: ప్రధాని మోదీ సమావేశం

Advertiesment
ఒమిక్రాన్ వైరస్‌ అలెర్ట్: ప్రధాని మోదీ సమావేశం
, బుధవారం, 22 డిశెంబరు 2021 (14:35 IST)
ఒమిక్రాన్ వైరస్‌తో భారత్ అప్రమత్తం అయ్యింది. దేశంలో కరోనా వైరస్, వ్యాక్సినేషన్ గురించి బుధవారం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. క్యాబినెట్ సెక్రటరీ రాజీవ్, ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా, యూనియన్ హెల్త్ సెక్రటరీ రాజేశ్ భూషన్, నీతి ఆయోగ్ సభ్యులు డాక్టర్ వీకే పాల్ తదితరులు హాజరయ్యారు.
 
ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలను జన్యు విశ్లేషణకు పంపాలని తెలిపారు. కొత్త వేరియంట్‌ గురించి రాష్ట్రాలు, జిల్లాస్థాయి అధికారులకు అవగాహన కల్పించేందుకు అధికారులు వారితో మాట్లాడుతూ ఉండాలని ప్రధాని చెప్పారు. రెండో డోసు తీసుకోని వారిని గుర్తించి వెంటనే అందించడానికి చర్యలు చేపట్టాలని తెలిపారు.
 
రెండు గంటల పాటు  జరిగిన ఈ సమావేశంలో అంతర్జాతీయ ప్రయాణాలపై నిషేధం ఎత్తివేసే ప్రణాళికలపైనా సమీక్ష జరపాలని అధికారులకు సూచించించారు. ముఖ్యంగా ఒమిక్రాన్‌ ప్రభావిత దేశాల నుంచి వచ్చేవారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కర్నూలు జిల్లాలో సీఎం జగన్ పర్యటన