కరోనా వైరస్ ఒమిక్రాన్ వైరస్‌గా రూపాంతరం చెందింది. దక్షిణాఫ్రికాలో ఈ వైరస్ తీవ్రంగా వ్యాపిస్తోంది. ఈ నేపథ్యంలో దక్షిణాఫ్రికా పరిశోధకులు ఒమిక్రాన్ మూలాల్లో హెచ్ఐవీ వుందని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. దక్షిణాఫ్రికాలో 18-45 ఏళ్ల వయస్సున్న ప్రతి ఐదుగురిలో ఒకరు హెచ్ఐవీకి గురయ్యారని.. ప్రపంచ హెచ్ఐవీ కేంద్రంగా ఆ దేశం మారిందని యూఎన్ఎయిడ్స్ నివేదిక తెలిపింది.
ఈ వైరస్ సోకిన వారిలో 30 శాతం పైగా మంది అసలు యాంటీరిట్రోవైరల్ డ్రగ్స్‌ను తీసుకోలేదని ఆ నివేదిక పేర్కొంది. హెచ్ఐవీ సోకినా ఎలాంటి మందులు వాడని వారు రోగ నిరోధక వ్యవస్థ చాలా బలహీనపడి, ఇతరత్రా వ్యాధులకు అలవాలంగా మారుతుంది.
సరిగ్గా ఇలాంటి మహిళే కరోనా బారిన పడిందని.... ఆమె శరీరంలోని హెచ్ఐవీ వైరస్ కారణంగా కరోనా ఉత్పరివర్తనాలకు గురై ఒమిక్రాన్‌గా అవతరించి వుంటుందని పరిశోధకులు నిర్ధారణకు వచ్చారు. హెచ్ఐవీ వైరస్ తిష్టవేసిన శరీరంలో కరోనా విజృంభించేందుకు అనువైన పరిస్థితులు వున్నాయని పరిశోధకులు తెలిపారు.