Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

బిగ్ బాస్ ఇంట్లో తేడాగాడు... అవకాశం వచ్చిందని ఎత్తేస్తున్నాడు...

బిగ్ బాస్ ఇంట్లో ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కౌశల్ ప్రవర్తన సరిగా లేదన్నది ఎక్కువ మంది మహిళా సభ్యుల‌ అభిప్రాయం. ఆతను మహిళలు అందరిపైన చేతులేసి మాట్లాడతారని, ఇది ఎవరికీ నచ్చడం లేదని బిగ్ బాస్‌కి చెప్పారు. రెండో వారానికి సంబంధించి ఎలినేషన్ ప్రక్

Advertiesment
బిగ్ బాస్ ఇంట్లో తేడాగాడు... అవకాశం వచ్చిందని ఎత్తేస్తున్నాడు...
, మంగళవారం, 19 జూన్ 2018 (17:50 IST)
బిగ్ బాస్ ఇంట్లో  ఆసక్తికర సంఘటన ఒకటి చోటుచేసుకుంది. కౌశల్ ప్రవర్తన సరిగా లేదన్నది ఎక్కువ మంది మహిళా సభ్యుల‌ అభిప్రాయం. ఆతను మహిళలు అందరిపైన చేతులేసి మాట్లాడతారని, ఇది ఎవరికీ నచ్చడం లేదని బిగ్ బాస్‌కి చెప్పారు. రెండో వారానికి సంబంధించి ఎలినేషన్ ప్రక్రియలో భాగంగా ఎవర్ని ఇంటి నుంచి‌ పంపేయాలని భావిస్తున్నారో చెప్పమంటూ ఒకేసారి ఇద్దరేసి సభ్యులను రహస్య గదిలోకి పిలిచారు. రెండు బ్యాచీలలోని ముగ్గరు సభ్యులు కౌశల్ మీద ఒకే రకమైన ఫిర్యాదు చేశారు. 
 
ఒక టాస్క్ సందర్భంలో తనను కౌశల్ చేతులపై ఎత్తుకోడాన్ని ప్రత్యేకంగా సునయన ప్రస్తావించారు. నేను ఆయనకు అంత క్లోజ్ కూడా కాదు. సొంత బ్రదర్ కూడా అలా చేయకూడదు. ఆయన చేసింది నాకు నచ్చలేదు. అందరూ అలాగే ఫీలవుతున్నారు. బయటకు చెప్పలేకున్నారు… అంటూ సునయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేసింది.
 
ఇదిలావుండగా కొంతసేపటికి ఇంటిలోకి కొత్త సభ్యురాలు నందిని ప్రవేశించారు. వచ్చీరాగానే కౌశల్ ఒకటికి రెండుసార్లు ఆమె భుజాలపై చేతులేసి మాట్లాడారు. కొన్ని నిమిషాల ముందు బిగ్ బాస్‌కు చేసిన ఫిర్యాదును‌ అతను తన ప్రవర్తనతో మరోసారి రుజువు చేసినట్లయింది. గత శనివారం నాని వచ్చినపుడు కౌశల్ నువ్వు ఎప్పుడూ అమ్మాయిలతోనే ఉంటున్నావు ఏమిటి… అని ప్రశ్నించారు. అతని ప్రవర్తన గమనించే బిగ్ బాస్ అలా అడిగించారేమో అనిపిస్తోంది. ఈ దెబ్బతో ఈ వారం కౌశల్ ఇంటి నుంచి బయటకు వచ్చే పరిస్థితి వచ్చేలా ఉంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఒడిశాలో రేప్ చేసి గుజరాత్ పారిపోయాడు... కానీ...