ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ(AI)తో ప్రయోజనాల మాట దేవుడుకెరుక. కానీ ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకుని చాలా చాలా తప్పుడు ప్రచారాలు అయితే జరిగిపోతున్నాయి. ఓ వ్యక్తి నిజంగా ఆ పని చేయకపోయినా చేసినట్లు చూపించేస్తున్నారు. ఇంకా రకరకాల జిమ్మిక్కులు చేస్తున్నారు. తాజాగా ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేవలం మూడు రోజుల్లో ఆ వీడియోను 15 లక్షల మంది చూసారంటే అది ఎంతగా ఆసక్తికరంగా వున్నదో అర్థం చేసుకోవచ్చు.
ఇక అసలు విషయానికి వస్తే.. అర్థరాత్రి వేళ ఓ పెంపుడు కుక్క ఇంటి బయట కాపలాగా అరుగు మీద పడుకుని నిద్రపోతోంది. ఇంతలో అక్కడికి ఓ సింహం వచ్చింది. కుక్క దగ్గరకు రావడంతో అది కూడా లేచింది. రెండూ కలిసి ముందుకు నడిచాయి. ఆ తర్వాత అవి రెండూ కలిసి తమ చూపుడు వేలు, చిటికెన వేలు చూపిస్తాయి. దాన్ని చూసిన మం షాకవుతాము. అప్పటివరకూ అది నిజమేనని నమ్మిన మనకు అది AI వీడియో అని అర్థమవుతుంది. అలా ఏఐ మంచి ఎంత చేస్తుందో అంతకంటే ఎక్కువగానే గందరగోళం చేస్తుందని అంటున్నారు.
AI కనుక్కున్న టెక్కీలకు అదే ఇప్పుడు భస్మాసుర హస్తంగా మారింది. ఈ సౌలభ్యం అందుబాటులోకి రావడంతో పలు సాఫ్ట్వేర్ కంపెనీలు వేలల్లో ఉద్యోగులను తొలగిస్తున్నారు. దీనితో వారి బతుకులు రోడ్డు మీద పడుతున్నాయి. అంతా AI వల్లనే ఇదంతా జరుగుతోంది మరి.