Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భగవత్ కేసరి , 12th ఫెయిల్ ఉత్తమ చిత్రం; షారుఖ్ ఖాన్, విక్రాంత్ మాస్సే ఉత్తమ నటుడి అవార్డు

Advertiesment
Bhavatnkesari, sukumar faimly

దేవీ

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (19:20 IST)
Bhavatnkesari, sukumar faimly
71వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలను శుక్రవారం న్యూఢిల్లీలోని నేషనల్ మీడియా సెంటర్‌లో ప్రకటించారు. ఈ అవార్డులకు, జనవరి 1, 2023 నుంచి డిసెంబర్ 31, 2023 మధ్య CBFC (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్) నుండి సర్టిఫికేషన్ పొందిన చిత్రాలు అర్హత పొందాయి. ఇటీవలి కాలంలో భారతీయ సినిమాకు 2023 అత్యంత విజయవంతమైన సంవత్సరాల్లో ఒకటి. 
 
 ప్రాంతీయ చిత్రాల్లో నందమూరి బాలక్రిష్ణ నటించిన భగవత్ కేసరికి ఉత్తమ చిత్రంగా దక్కింది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. అలాగే ఉత్తమ స్టంట్ మాస్టర్ లుగా నందు, ప్రుద్వీలకు దక్కింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రూపొందిన హనుమాన్ సినిమాకు దక్కింది.  అదేవిధంగా బలగం సినిమాలో కాసర్ల శ్యామ్ రాసిన ’ఊరు పల్లెటూరు..’ పాటకు ఉత్తమ గీతంగా ఎంపికచేశారు. 
 
ఏనిమేషన్, విజువల్స్, గేమింగ్ అండ్ కామిక్ కేటగిరి కింద హనుమాన్ లో బెస్ట్ ఫిలింగా దక్కించుకుంది. ప్రైమ్ షో ఎంటర్ టైన్ మెంట్ నిర్మాణంలో ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించారు. బెస్ట్ మేల్ ప్లేబ్యాక్ సింగర్ గా పి.వి.ఎన్. రోహిత్ దక్కించుకున్నాడు. బేబి సినిమాలో ప్రేమిస్తున్నా.. పాటకు దక్కింది. 
 
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్టుగా గాంధీ తాత చెట్టు లో నటించిన సుకుమార్ కుమార్తె బేబి క్రుతికి దక్కింది. అలాగే మరాట సినిమా గ్రిప్సీలో నటించిన బాల నటుడు  కబీర్ కండేరేకి దక్కింది. అలా నూల్ 2 మరాటీ సినిమాలో నటించిన చైల్డ్ ఆర్టిస్టులుగా త్రీషా తోషార్, శ్రీనివాస్ పోకలే, భార్గవ్ లు దక్కించుకున్నారు. అలాగే తమిళ, మలయాళ సినిమాలకూ దక్కాయి.
 
జ్యూరీకి ధన్యవాదాలు తెలిపిన అనిల్ రావిపూడి
భగవంత్ కేసరి సినిమాకు అవార్డు రావడం పట్ల దర్శకుడు అనిల్ రావిపూడి ధన్యవాదాలు తెలియజేశారు. మానవ ప్రయత్నంగా కష్టపడితే ఏదైనా సాధించవచ్చని హీరోయిన్ పాత్ర ద్వారా చూపించామనీ, ఈ సినిమాను అంగీకరించిన నందమూరి బాలక్రిష్ణకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా అవార్డు ఎంపిక జ్యూరీ కమిటీ ప్రత్యేక దన్యవాదాలు తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'