Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జాతీయ చలన చిత్ర అవార్డులు - ఉత్తమ చిత్రంగా 'భగవంత్ కేసరి'

Advertiesment
bhagavanth kesari

ఠాగూర్

, శుక్రవారం, 1 ఆగస్టు 2025 (19:16 IST)
కేంద్ర ప్రభుత్వం శుక్రవారం 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాలను ప్రకటించింది. జాతీయ ఉత్తమ చిత్రంగా '12th ఫెయిల్‌'కు అవార్డు దక్కింది. జాతీయ ఉత్తమ నటుడి అవార్డును ఇద్దరు పంచుకున్నారు. షారుక్‌ ఖాన్‌ (జవాన్‌), విక్రాంత్‌ మస్సే (12th ఫెయిల్‌)లు ఎంపికయ్యారు. ఉత్తమ నటిగా ‘మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే’ (హిందీ)లో నటనకు రాణీ ముఖర్జీని అవార్డు వరించింది. తెలుగు ఉత్తమ ప్రాంతీయ చిత్రంగా బాలకృష్ణ నటించిన 'భగవంత్ కేసరి', తమిళంలో 'పార్కింగ్' చిత్రాలు ఎంపికయ్యాయి. బెస్ట్‌ ఫిల్మ్‌ క్రిటిక్‌ అవార్డు ఉత్పల్‌ దత్త (అస్సామీ)కు ప్రకటించారు.
 
జాతీయ చలన చిత్ర అవార్డులు.. ఉత్తమ నటుడు షారుక్‌.. 
ఉత్తమ చిత్రం 12th ఫెయిల్‌ 
ఉత్తమ తెలుగు చిత్రం భగవంత్‌ కేసరి
ఉత్తమ తమిళ చిత్రంగా ‘పార్కింగ్‌’ 
జాతీయ చలన చిత్ర అవార్డులు ఫీచర్‌ ఫిల్మ్‌
ఉత్తమ సంగీత దర్శకుడు ; వాతి (తమిళ్‌) జీవీ ప్రకాశ్‌ కుమార్‌
ఉత్తమ సంగీతం (నేపథ్యం): యానిమల్‌: హర్షవర్థన్‌ రామేశ్వర్‌:
బెస్ట్‌ మేకప్‌: సామ్‌ బహూదర్‌ (హిందీ) శ్రీకాంత్‌దేశాయ్‌
బెస్ట్‌ కాస్ట్యూమ్‌ డిజైనర్‌: సామ్‌ బహదూర్‌ (హిందీ)
బెస్ట్‌ప్రొడక్షన్‌ డిజైన్‌: 2018 - ఎవ్రీ వన్‌ ఈజ్‌ ఏ హీరో (మలయాళం) మోహన్‌దాస్‌
బెస్ట్‌ ఎడిటింగ్‌: పూక్కాలమ్‌ (మలయాళం) మిధున్‌ మురళి
బెస్ట్‌ సౌండ్‌ డిజైన్‌: యానిమల్‌ (హిందీ) సచిన్‌ సుధాకరన్‌, హరి హరన్‌ మురళీ ధరన్‌
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): బేబీ (తెలుగు) సాయి రాజేశ్‌ నీలం
బెస్ట్‌ స్క్రీన్‌ప్లే (ఒరిజినల్‌): పార్కింగ్‌ (తమిళ్‌) రామ్‌కుమార్‌ బాలకృష్ణన్‌
ఉత్తమ సంభాషణలు: సిర్ఫ్‌ ఏక్‌ బందా కాఫీ హై (హిందీ) దీపక్‌ కింగ్రానీ
ఉత్తమ సినిమాటోగ్రఫీ: ది కేరళ స్టోరీ (హిందీ): పసంతను మొహపాత్రో
ఉత్తమ నేపథ్య గాయని: జవాన్‌ (చెలియా) శిల్పారావు
ఉత్తమ నేపథ్య గాయకుడు: బేబీ( పీవీన్‌ ఎస్‌ రోహిత్‌)
బెస్ట్‌ చైల్డ్‌ ఆర్టిస్ట్‌: గాంధీతాత చెట్టు (సుకృతివేణి), జిప్సీ (మరాఠీ) కబీర్‌ ఖండారీ, నాల్‌ 2 (మరాఠీ) త్రిష థోసర్‌, శ్రీనివాస్‌ పోకలే, భార్గవ్‌ జగ్దీప్‌
ఉత్తమ సహాయ నటి: ఉల్లుకు (మలయాళం) ఊర్వశి, వష్‌ (గుజరాతీ) జానకీ బోడివాలా
ఉత్తమ సహాయ నటుడు: పూక్కాలం (మలయాళం)  విజయ రాఘవన్‌, పార్కింగ్‌ (తమిళ్‌) ఎంఎస్ భాస్కర్‌
ఉత్తమ నటి : మిస్సెస్‌ ఛటర్జీ వర్సెస్‌ నార్వే (హిందీ):రాణీ ముఖర్జీ
ఉత్తమ నటుడు: జవాన్‌ (హిందీ) షారుక్‌ఖాన్‌, 12th ఫెయిల్‌ (హిందీ) విక్రాంత్‌ మస్సే
ఉత్తమ దర్శకత్వం: ది కేరళ స్టోరీ (హిందీ) సుదీప్తో సేన్‌
ఉత్తమ యానిమేషన్‌ విజువల్‌ ఎఫెక్ట్స్‌ మూవీ: హనుమాన్‌ (తెలుగు)
ఉత్తమ బాలల చిత్రం: నాల్‌ (మరాఠీ)
ఉత్తమ జాతీయ సమగ్రత, సామాజిక విలువల చిత్రం:  సామ్‌ బహదూర్‌ (హిందీ)
ఉత్తమ ప్రజాదరణ చిత్రం: రాకీ ఔర్‌ రాణి కి ప్రేమ్‌ కహానీ (హిందీ)
ఉత్తమ పరిచయ దర్శకుడు: ఆత్మపాంప్లెట్‌ (మరాఠీ)  ఆశిష్‌ బెండే
ఉత్తమ ఫీచర్‌ ఫిల్మ్‌: 12 ఫెయిల్‌ 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Satyadev: మత్స్యకారుల బతుకుపోరాటంగా అరేబియా కడలి ట్రైలర్