Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Shah Rukh Khan: సుకుమార్ కు బాలీవుడ్ ఆపర్లు - షారుఖ్ ఖాన్ తో చర్చలు

Advertiesment
Sukumar, sharuk khan

దేవీ

, మంగళవారం, 18 మార్చి 2025 (12:05 IST)
Sukumar, sharuk khan
పుష్ప సినిమా తర్వాత దర్శకుడు సుకుమార్ కు బయట చాలా పేరువచ్చింది. ఆయన్ను తమిలంలోనూ సినిమా చేయమని ఆపర్ వచ్చింది. అయితే బాలీవుడ్ ప్రముఖ నిర్మాత సుకుమార్ తో చర్చలు జరుపుతున్నట్లు వార్తలు ప్రధానంగా వినిపిస్తున్నాయి. ప్రస్తుతం పుష్ప 3 సినిమా పనిలో వున్నాననీ చెబుతున్నా ఇంకా కథ సెట్ కాలేదనీ పుష్ప 2 టీమ్ విజయోత్సవంలో సుకుమార్ ప్రకటించారు. 
 
తెలుగు దర్శకులు హిందీ చిత్రాలకు దర్శకత్వం వహించినవారిలో కె. రాఘవేంద్రరావు, బాపయ్య, తాతినేని రామారావు, దాసరి నారాయణరావు, మణిరత్నం, ప్రియదర్శన్,  రామ్ గోపాల్ వర్మ వున్నారు. అదేవిధంగా తమిళంనుంచి  ఎ.ఆర్. మురుగదాస్, అట్లీ కుమార్, సందీప్ రెడ్డి,  మరియు గౌతమ్ తిన్ననూరి వంటి దర్శకులు హిందీ చిత్ర పరిశ్రమలో తమదైన ముద్ర వేశారు.
 
ఇప్పుడు, పుష్ప దర్శకుడు సుకుమార్ బాలీవుడ్‌లోకి అడుగుపెట్టబోతున్నారనేది తాజా వార్త. ముఖ్యంగా షారుఖ్ ఖాన్‌కు దర్శకత్వం వహించనున్నారని రిపోర్ట్ లు తెలియజేస్తున్నాయి. షారుఖ్ ఖాన్ తమిళ దర్శకుడు అట్లీతో జవాన్ సినిమా చేశారు. ఇది భారీ విజయాన్ని సాధించింది. అలాగే పుష్ప 2తో  బ్లాక్‌బస్టర్‌లను అందించిన సుకుమార్ తో సినిమా చేయనున్నాడని తెలుస్తోంది. ఈ చిత్రం గ్రామీణ రాజకీయ యాక్షన్ డ్రామాగా ఉంటుందనే భావిస్తున్నారు.
 
పుష్ప 2 తర్వాత బాలీవుడ్ లో అడుగుతున్నారని ఓ సందర్భంగా సుకుమార్ చెప్పాడు. కానీ మాత్రుభాషలోనే చేస్తానని  అక్కడ భాష తనకు సమస్య అవుతుందని ఓ సందర్భంలో చెప్పాడు. పుష్ప రెండు భాగాలకే దాదాపు నాలుగున్నర సంవత్సరాలు పట్టింది. షారూఖ్ తో సినిమా వుంటే కనీసం రెండేళ్ళయినా పట్టవచ్చని విశ్లేషఖులు తెలియజేస్తున్నారు.
 
కాగా, సుకుమార్ ప్రస్తుతం రామ్ చరణ్‌తో RC 17, ఆ తర్వాత పుష్ప 3: ది రాంపేజ్‌ చిత్రాలు చేసే పనిలో వున్నాడు. మరోవైపు షారూఖ్ కు పఠాన్ 2 ఉన్నాయి. వారి షెడ్యూల్‌లను బట్టి చూస్తే, సుకుమార్, షారుఖ్ ఖాన్ రెండేళ్ళ తర్వాత చేస్తారేమో అనిపిస్తుంది. కానీ వాటిలో ఏదో ఒకటి ఆలస్యమైతే షారూఖ్ తో చేయడానికి వీలుకుదురుతుందని తెలుస్తోంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

చిరంజీవి సరసన యువ హీరోయిన్.. గ్రామీణ నేపథ్యంలో అనిల్ మూవీ!