నటీనటులు : విజయ్ ఆంటోని, వాగై చంద్రశేఖర్, సునీల్ కృపలాని, సెల్ మురుగన్, తృప్తి రవీంద్ర, కిరణ్, రినీ బోట్, రియా జిత్తు, మాస్టర్ కేశవ్
సాంకేతికత: సినిమాటోగ్రాఫర్ : షెల్లీ కాలిస్ట్, ఎడిటర్ : రేమండ్ డెరిక్ క్రాస్టా, దర్శకుడు : అరుణ్ ప్రభు, నిర్మాత : విజయ్ ఆంటోని, సంగీత దర్శకుడు : విజయ్ ఆంటోని
కథానాయకుడు విజయ్ ఆంటోనీ చిత్రాలు వైవిధ్యంగా కనిపిస్తాయి. మొదటినుంచి భిన్నమైన కథలను ఆయన ఎంచుకుంటున్నారు. బిచ్చగాడుతో అది మరింత పేరు తెచ్చుకున్నారు. తాజాగా భద్రకాళి పేరుతో సినిమా చేశారు. సమకాలీన రాజకీయ నేపథ్యంగా ఆయన చెప్పారు. మరి సినిమా ఎలా ఉందో సమీక్షలో చూద్దాం రండి.
కథ:
సెక్రటేరియట్ లో ఒక మీడియేటర్ గా పని చేసే కిట్టు (విజయ్ ఆంటోనీ) తన ఇన్ఫ్లూయెన్స్ తో లంచాలు ఇవ్వలేనివారిని ఆదుకున్నాడు. అదే లంచాలు ఇచ్చేవారితో ముక్కుపిండి వసూలు చేస్తాడు. ప్రజలు ఎదుర్కొంటున్న ఎన్నో సమస్యలకు ఆయన సాల్వ్ చేసే కిట్టుగా పేరు తెచ్చుకున్నారు. రాజకీయ వ్యూహకర్త అభ్యంకర్ శంకర్ (సునీల్ కృపాలని) ఇంటిలో తలోనాలుకగా మెలిగే కిట్టు ఢిల్లీ లెవల్ లో ఓ డీల్ కు ఒప్పుకుని ఇరకాటంలో పడతాడు. అది ఏమిటి? కిట్టు చేసిన పనికి ఢిల్లీ నుంచి స్పెషల్ ఆఫీసర్ వస్తాడు? ఆ తర్వాత ఏమి జరిగింది? అసలు అభ్యంకర్ శంకర్ ఇంటిలో పనివాడిగా ఎందుకు చేరాడు? అతని గతం ఏమిటి. అనేది మిగిలిన సినిమా.
సమీక్ష:
ఈ చిత్రం మొదట్లోనే ఆడియెన్ ని కట్టిపడేసే విధంగా మొదలవుతుంది. ఇలా ఒక ఇంట్రెస్టింగ్ స్టార్ట్ తర్వాత కథనం అలా ఒకో లేయర్ లోకి వెళ్లే కొద్దీ మరింత గ్రిప్పింగ్ గా మారడం అనేది ఇంప్రెస్ చేస్తుంది. కిట్టు పాత్ర తీరును దర్శకుడు బాగా డీల్ చేశాడు. సి.ఎం. స్థాయి వాడిని కూడా కంట్రోల్ చేసే స్థాయికి కిట్టు ఎదుగుతాడు. కథంతా ఢిల్లీ నుంచి గల్లీ లో జరిగే దందాలు కనిపిస్తాయి. సర్పంచ్ నుంచి ఎం.ఎల్.ఎ., మంత్రి, ఎం.పి. ఇలా స్థాయిని బట్టి అందరూ ప్రజల్ని దోచుకోవడమే.
అందులో ఐ.ఎ.ఎస్.లు, ఐ.పి.ఎస్.లు ఇలా ఎందరో కిట్టు చేతిలో కీలుబొమ్మలుగా మారతాడు. దేశంలో కిట్టు లాంటి మీడియేటర్ లు ఏవిధంగా శాసిస్తున్నారనేది చక్కగా చూపించాడు. ప్రతీ చోట లంచం దాన్ని ఎదరించే శక్తి ప్రజలది. కానీ ఆ ప్రజలు నోరు మెదపరు. ఎవరైనా మెదిపినా అణగదొక్కేస్తారు. ఈ లాజిక్ తో స్వాతంత్యానికి ముందు బ్రిటీష్ వారు కొల్ కత్తాలో ఆరుగురు మాత్రమే వచ్చారు. వారికి అప్పటి నాయకులు తొత్తులుగా ఆహ్వానించారు. ప్రజలు ఎదురుతిరిగితే వెను తిరిగి వెళ్ళిపోవాలనుకున్నారు. కానీ ప్రజల్లో చైతన్యం రాలేదు. అది సాకుగా తీసుకుని ఎంతోమంది దేశాన్ని పాలించారు. ఈ పాయింట్ తో కథను రాసుకుని ఇప్పటికీ కూడా ప్రజలను ఏవిధంగా అధికారులు, పాలకులు పీడించి బిచ్చగాడిలా మారుస్తారనేది దర్శకుడు చక్కగా ఆవిష్కరించారు.
ఇలాంటి సీరియస్ కథలో కొన్ని చిన్నపాటి లోపాలుంటాయి. అయినా టెక్నాలజీతో యూత్ ను బానటగా చేసుకుని దేశాన్ని శాసించే బిగ్ షాట్స్ ను కూడా డీల్ చేసేలా సినిమాటిక్ గా తీశారు. విజయ్ ఆంటోనీ నుంచి కథ,కథనాలు పరంగానే కాకుండా నటుడుగా కూడా ఈ సినిమాకి తాను మెప్పించారు అని చెప్పవచ్చు. తన పాత్రలోని పలు షేడ్స్ ని తాను బలంగా ప్రెజెంట్ చేశారు. అలాగే సెల్ మురుగన్, సునీల్ కృపాలనిలు తమ పాత్రల్లో సాలిడ్ పెర్ఫామెన్స్ లు అందించి తమ పాత్రలు రక్తి కట్టించారు.
ఫ్లాష్ బ్యాక్ లో కిట్టు ఏవిధంగా తల్లిని కోల్పోయాడు. ఎవరి వల్ల కోల్పోయాడు. .అనేది ప్రేక్షకుడికి తప్పితే దానికి కారణమైన వ్యక్తికి తెలుసా? లేదా? అనే డైలమాలో వదిలేశాడు. ఏది ఏమైనా మంచి పనులు చేయడానికి ధైర్యంతోపాటు హంగు కూడా కావాలి. లేదంటే పాలకులు ప్రజలను పీల్చి పిప్పిచేస్తారు. ఇదే సినిమాలో చెప్పిన సందేశం. ఈ రాజకీయ చదరంగంలో ఎన్నో ఎత్తులు, పై ఎత్తులుంటాయి. అవన్నీ చక్కగా డీల్ చేశారు.
ఈ చిత్రంలో నిర్మాణ విలువలు బాగున్నాయి. విజయ్ ఆంటోనీ సంగీతం కూడా అందించారు. తన స్కోర్ తో సినిమాలో మంచి ఇంట్రెస్ట్ కలిగించారు. అలాగే సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ వర్క్స్ ఈ చిత్రానికి బాగున్నాయి. ఇక దర్శకుడు అరుణ్ ప్రభు విషయానికి వస్తే.. తాను ఈ పొలిటికల్ థ్రిల్లర్ ని ఒక శంకర్ స్టైల్ లో డిజైన్ చేసుకున్నట్టు అనిపిస్తుంది. అయినప్పటికీ మంచి ఆసక్తికర కథనం, ఇంప్రెస్ చేసే స్క్రీన్ ప్లే తో డిజైన్ చేసుకోవడం బాగుంది. అయితే టైటిల్ కూ కథకు పెద్దగా లింక్ లేకపోయినా చిన్నతనంలో అమ్మవారి ఆదరణతో పుట్టాడు కనుక టైటిల్ అలా పెట్టారనిపిస్తుంది. ఇలాంటి సినిమాలు యూత్ తప్పనిసరిగా చూడాల్సిన అవసరం వుంది.