Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Vijay: టాలెంట్ ఉందోలేదో తెలీదు, ఆ డైరెక్టర్ తో వంద దేవుళ్ళు చేస్తున్నా : విజయ్ ఆంటోనీ

Advertiesment
Vijay Antony

దేవీ

, బుధవారం, 17 సెప్టెంబరు 2025 (16:57 IST)
Vijay Antony
భద్రకాళి పొలిటికల్ థ్రిల్లర్.  కరెంట్  పాలిటిక్స్ ఇందులో కోర్ ఎలిమెంట్. నేను పొలిటికల్ మీడియేటర్ గా కనిపిస్తాను. సాదరణంగా రాజకీయాల్ని మనం సినిమాల్లో చాలా డ్రమెటిక్ గా చూస్తాం. కానీ ఈ సినిమాలో పాలిటిక్స్  చాలా నేచురల్ గా చూపించడం జరిగింది.  రాజకీయాల్లో ఒక మీడియేటర్ పాత్ర ఎలా ఉంటుంది? ఒక పెద్ద పెద్ద స్కాం లో తన పాత్ర ఏమిటి? అనేది ఆడియన్స్ కి  న్యూ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది. ఈ పాలిటిక్స్ ప్రతి ఒక్కరు రిలేట్ చేసుకునేలా వుంటుంది అని విజయ్ ఆంటోనీ తెలిపారు.
 
విజయ్ ఆంటోనీ మూవీ భద్రకాళి. అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్,  మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాను ఏషియన్ సురేష్ ఎంటర్‌టైన్‌మెంట్, రాణా దగ్గుబాటి స్పిరిట్ మీడియాతో కలిసి సెప్టెంబర్ 19న రిలీజ్ చేస్తున్నారు. ఈ సందర్భంగా  హీరో విజయ్ ఆంటోనీ సినిమా విశేషాలు తెలియజేశారు.
 
- డైరెక్టర్ అరుణ్ ప్రభు గారు అద్భుతమైన కథ తీసుకొచ్చారు. ఆయన ఇంతకుముందు రెండు సినిమాలు చేశారు. అందులో అరవి సినిమా నాకు చాలా ఇష్టం. ఆయన దర్శకత్వంలో నా 25వ సినిమా రావడం ఆనందంగా ఉంది ఇప్పటివరకు నేను చేసిన  సినిమాల్లో ఇది బిగ్గెస్ట్ మూవీ ఇది.
 
- పొలిటికల్ సినిమాల్లో ఇది ఒక డిఫరెంట్ మూవీ. ఇలాంటి పొలిటికల్ బ్రోకర్ క్యారెక్టర్ ఇప్పటివరకు క్యారెక్టర్ రాలేదు. ఈ ప్రతి ఎలిమెంటు చాలా రియల్ గా కనిపిస్తుంది. మేకప్ లేకుండా నటించడం జరిగింది. మా ప్రతిదీ చాలా నేచురల్ గా తీశారు. ఇది రొటీన్ పొలిటికల్ సినిమా కాదు, ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఇస్తుంది.  
 
- నేను అరుణ్  గారితో ఒక సినిమా చేయాలని ముందే డిసైడ్ అయ్యాను. ఆయనకి నేను పెద్ద ఫ్యాన్ ని. ఆయన చెప్పిన తర్వాత కథ అద్భుతంగా నచ్చింది. అయితే ఆయన ప్రీవియస్ కంటే బిగ్ బడ్జెట్ కథ చెప్పారు. నా కెరీర్ లోనే బిగ్గెస్ట్ బడ్జెట్ తో వస్తున్న సినిమా ఇది.
 
- 25 సినిమాల జర్నీ చాలా ఆనందంగా అనిపించింది. ప్రేక్షకులు ఎంతో ప్రేమ అభిమానాన్ని పంచారు. తెలుగు ప్రేక్షకులు కూడా గొప్పగా ఆదరించారు. నాకు టాలెంటు ఉందో లేదో తెలియదు కానీ నేను చాలా సిన్సియర్ హార్డ్ వర్క్ చేస్తాను. సినిమా కోసం రాత్రి పగలు కష్టపడతాను. భవిష్యత్తులో కూడా ఎంతో హార్డ్ వర్క్ చేసి నిజాయితీతో కూడిన సినిమాలని చేయాలని భావిస్తున్నాను.
 
- యాక్టింగ్, డైరెక్షను, మ్యూజిక్ ఇలా చేయడంలో ఎలాంటి ఛాలెంజ్ లేదు. ఎందుకంటే ఒక సమయంలో ఒకటి ఒకే పని చేస్తాను. అయితే సమయాన్ని మేనేజ్ చేసుకోవడం అనేది కొంచెం ఛాలెంజ్ తో కూడుకున్న విషయం. యాక్టింగ్, నిర్మాణం కారణంగా మ్యూజిక్ కి తక్కువ సమయం వుంటుంది. ఇకపై మ్యూజిక్ కోసం కూడా ప్రత్యేకంగా సమయం కేటాయించాలని భావిస్తున్నాను.  
 
- కొత్త ప్రాజెక్ట్స్ గురించి చెప్పాలంటే, బిచ్చగాడు డైరెక్టర్ తో వంద దేవుళ్ళు సినిమా చేస్తున్నాను. బిగ్ స్కేల్ మూవీ అది. తెలుగు తమిళ్లో రెండు భాషల్లో ఒకేసారి ఆ సినిమా రిలీజ్ అవుతుంది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

హరికథ రిలీజ్ డేట్ పోస్టర్ విడుదల చేసిన మంత్రి వాకిటి శ్రీహరి