Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

భద్రకాళి చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది : తృప్తి రవీంద్ర, రియా జిత్తు

Advertiesment
Trupti Ravindra, Riya Jithu

దేవీ

, సోమవారం, 8 సెప్టెంబరు 2025 (18:36 IST)
Trupti Ravindra, Riya Jithu
హీరో విజయ్ ఆంటోనీ భద్రకాళితో వస్తున్నారు. ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్,  మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు. సెప్టెంబర్ 19న రిలీజ్  కానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తృప్తి రవీంద్ర, రియా జిత్తు విలేకరుల సమవేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
హీరోయిన్ తృప్తి రవీంద్ర మాట్లాడుతూ.. మాది మహారాష్ట్ర. తమిళ్లో హీరోయిన్ గా ఇది నా ఫస్ట్ సినిమా. సినిమాల్లోకి రాకముందు నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేశాను. ఇంజనీరింగ్ సమయంలోనే నాకు సినిమా పట్ల చాలా ఆసక్తి ఉండేది. థియేటర్స్ ప్లేస్ కోసం ఆడిషన్స్ ఇచ్చాను. కెమెరా ముందు నటించడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చే విషయం. కొన్ని టీవీ కమర్షియల్స్ కూడా చేశాను.
 
అరుణ్ గారి డైరెక్షన్ టీం నుంచి ఈ సినిమా కోసం ఆడిషన్ కాల్ వచ్చింది. తర్వాత అడిషన్ ఇచ్చాను. లుక్ టెస్ట్ చేసిన తర్వాత ఈ క్యారెక్టర్ కోసం ఓకే చేశారు. ఈ సినిమాలో చాలా రిలేటబుల్ క్యారెక్టర్ చేస్తున్నాను. అందరూ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది. డైరెక్టర్ గారు చాలా అద్భుతంగా క్యారెక్టర్ డిజైన్ చేశారు.  
 
ఈ సినిమా చాలా బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. షూటింగ్  చాలా ఎంజాయ్ చేశాను. విజయ్ గారితో నటించడం చాలా మంచి ఎక్స్పీరియన్స్ డైరెక్టర్ గారు ప్రొడ్యూసర్ అందరు చాలా సపోర్ట్ చేశారు.
 
తెలుగు ఆడియన్స్ అన్ని రకాల సినిమాల్ని గొప్పగా ఆదరిస్తారు. సినిమాని గొప్పగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ సినిమా కూడా ఆడియన్స్ మంచి ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కోరుకుంటున్నాను.
 
హీరోయిన్ రియా జిత్తు మాట్లాడుతూ.. నేను మలయాళీ.  తమిళ్, మలయాళీ సినిమాలు చూస్తూ పెరిగాను. చైల్డ్ ఆర్టిస్ట్ గా నాకు అనుభవం ఉంది. దాదాపు 15 సినిమాలు చైల్డ్ ఆర్టిస్ట్ గా చేశాను. సినిమాల నుంచి కొంత బ్రేక్ తీసుకొని చదువుపై దృష్టి పెట్టాను. చదువు పూర్తయిన తర్వాత మళ్లీ సినిమాల్లోకి వచ్చాను.
 
విజయ్ ఆంటోనీ గారి 25వ సినిమాలో భాగం కావడం చాలా ఆనందంగా ఉంది. ఆయన మ్యూజిక్ వింటూ పెరిగాను. ఆయన మ్యూజిక్ నాకు చాలా ఇష్టం.
 
ఈ సినిమాలో ఒక డిఫరెంట్ క్యారెక్టర్ చేశాను. ఇప్పుడే ఎక్కువ రివిల్  చేయకూడదు. విజయ్ గారు చాలా హంబుల్ పర్సన్. ఆయన నుంచి చాలా విషయాలు నేర్చుకున్నాను.  
 
ఇది చాలా ఇంపాక్ట్ ఫుల్ కథ. ఇలాంటి కథ సొసైటీ కి చాలా అవసరం. తప్పకుండా ఈ సినిమా అందరికీ కనెక్ట్ అయ్యేలా ఉంటుంది.
 
తెలుగు ఆడియన్స్ మంచి సినిమాలని ఆదరిస్తారు. భద్రకాళి కూడా చాలా ఇంపాక్ట్ ఫుల్ కంటెంట్ తో వస్తున్న సినిమా. తప్పకుండా అందరినీ అలరిస్తుందని కోరుకుంటున్నాను

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కిష్కింధపురి కథకి స్ఫూర్తి రామాయణం : డైరెక్టర్ కౌశిక్ పెగల్లపాటి