Ramanjaneyulu Jawvaji, Vijay Antony
హీరో విజయ్ ఆంటోనీ మార్గన్ విజయం తర్వాత మరో పవర్ ఫుల్ ప్రాజెక్ట్ భద్రకాళితో వస్తున్నారు. విజయ్ ఆంటోనీకి ల్యాండ్‌మార్క్ మూవీగా నిలిచే ఈ చిత్రానికి అరుణ్ ప్రభు దర్శకత్వం వహించగా, సర్వంత్ రామ్ క్రియేషన్స్ బ్యానర్‌పై రామాంజనేయులు జవ్వాజీ నిర్మించారు. ఈ ప్రాజెక్ట్‌ను విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్, మీరా విజయ్ ఆంటోనీ సమర్పిస్తున్నారు.
ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కనెక్ట్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. చిత్రం సెప్టెంబర్ 19న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా నిర్మాత రామాంజనేయులు జవ్వాజీ విశేషాలు పంచుకున్నారు.
-విజయ్ ఆంటోనీ నేను మిత్రులం. విజయ్ ఆంటోనీ ఫిలిం ఫ్యాక్టరీ, మా బ్యానర్ సర్వంత్ రామ్ క్రియేషన్స్ కలిపి కొన్ని మూవీస్ చేయాలని ప్రయాణం మొదలుపెట్టాం. మార్గాన్ సినిమా మంచి విజయాన్ని అందుకుంది.
-ఇటీవలే బూకి అనే సినిమాని మొదలుపెట్టాం. మలయాళం లో ఒక సినిమా చేస్తున్నాం. అది చివరి దశకు వచ్చింది. మా రెండు బ్యానర్స్ లో ఇంకొన్ని సినిమాలు కూడా చర్చల్లో ఉన్నాయి. త్వరలోనే వాటి గురించి అనౌన్స్ చేస్తాం. బిచ్చగాడు డైరెక్టర్ శశి, విజయ్ ఆంటోని కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్టు ఉంటుంది. తొందరలో అది అనౌన్స్ చేస్తాం. మేము విజయ్ ఆంటోని కలవడం వల్ల బ్యాక్ టు బ్యాక్ సినిమాలో చేస్తున్నాము. మా నుంచి వరుసగా సినిమాలు రాబోతున్నాయి.
-సినిమాకి భద్రకాళి అనే టైటిల్ పెట్టాము. సరిగ్గా దసరా నవరాత్రులు సమయంలోనే ఈ సినిమా రావడం కలిసి వచ్చిందని మార్గాన్ సినిమాని రిలీజ్ చేసిన మా డిస్ట్రిబ్యూటర్స్ చెప్పారు. మార్గన్ కంటే ఈ సినిమాకి 20% థియేటర్స్ పెరిగే అవకాశం ఉందని కూడా అన్నారు. వారు ఆ మాట చెప్పడం నాకు చాలా ఆనందాన్ని ఇచ్చింది.
-పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఈ సినిమాలో హీరో గారు చేసిన క్యారెక్టర్ తో ఇప్పటివరకు ఎలాంటి సినిమా రాలేదు. చాలా డిఫరెంట్ క్యారెక్టర్. ఇలాంటి హీరో క్యారెక్టర్ తో ఇప్పటివరకు సినిమా రాలేదు. సమాజంలో జరుగుతున్న విషయాల్ని బేస్ చేసుకుని తీసిన సినిమా. అందరూ పర్సనల్ గా కనెక్ట్ అవుతారు.
-తెలుగులో సత్యదేవ్ గారితో ఫుల్ బాటిల్ అనే సినిమా చేస్తున్నాం. అది కంప్లీట్ అయి రెడీగా ఉంది. నవంబర్లో రిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాం.