Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆత్మ నేపథ్యం లో విరాజ్ రెడ్డి చీలం చిత్రం గార్డ్ - రివ్యూ

Advertiesment
Viraj Reddy Cheelam, Mimi Leonard

దేవి

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:53 IST)
Viraj Reddy Cheelam, Mimi Leonard
విరాజ్ రెడ్డి చీలం, మిమీ లియానార్డ్ హీరో హీరోయిన్ లు గా  తెరకెక్కిన సినిమా 'గార్డ్'. రివెంజ్ ఫర్ లవ్ ట్యాగ్‌లైన్‌. అను ప్రొడక్షన్స్‌ బ్యానర్ పై  అనసూయ రెడ్డి నిర్మాణంలో జగ పెద్ది దర్శకత్వంలో రూపొందింది. శిల్పా బాలకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఆస్ట్రేలియాలో తెరకెక్కించిన ఈ గార్డ్ సినిమా నేడు ఫిబ్రవరి 28న విడుదల అయింది. ఎలా ఉందొ చూద్దాం.
 
కథ:
ఆస్ట్రేలియాలో సెటిల్ అయిన సుశాంత్ (విరాజ్ రెడ్డి) ఆసుపత్రిలో సెక్యూరిటీ గార్డ్ గా పనిచేస్తూ ఉంటాడు. అక్కడ డాక్టర్ సామ్ (మిమీ లియానార్డ్)ని ఓ ఆపదనుంచి రక్షిస్తాడు. దానితో ఆమె ప్రేమలో పడుతుంది. ఇదిలా ఉండగా, సుశాంత్ పనిచేసే హాస్పిటల్ బేస్మెంట్ లో ఎప్పుడూ ఏదో అరుపులు వినిపిస్తూ ఉంటాయి. ఆసక్తిగా ఉండడంతో డాక్టర్ సామ్ అడగడంతో తీసుకెళ్తాడు. అక్కడ లాక్ చేసిన ఓ రూమ్ ను తెరిచి వెళుతుంది. అంతే, ఆమెలో ఒక ఆత్మ ప్రవేశిస్తుంది. దీంతో ఆ ఆత్మ సామ్ శరీరాన్ని ఇబ్బంది పెడుతూ సుశాంత్ ని, అతని ఫ్రెండ్ ని భయపెడుతుంది. అసలు ఆ ఆత్మ ఎవరిది? ఆ ఆత్మ కథ ఏంటి? సుశాంత్ కి ఆ ఆత్మకు సంబంధం ఏంటి? ఇవి తెలుసుకోవాలంటే సినిమా చూడాల్సిందే. 
 
సమీక్ష:
ఆత్మ పగ, ప్రతీకారం కాన్సెప్ట్ లు పలు సినిమాలు వచ్చాయి. గతంలో రాం, తమన్నా చిత్రం ఉంది. ఇక ఈ సినిమాలో చనిపోయిన ఓ అమ్మాయి ఆత్మగా తిరిగొచ్చి తన పగను తీర్చుకోవడం అనేది కథ.  కథనంలో దర్శకుడు  కొత్తదనం చూపించారు. ఆస్ట్రేలియాలో కథ జరగడం, అక్కడ గార్డ్ గా పనిచేసే హీరోతో కొత్తగా భయపెట్టడానికి ట్రై చేసారు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో, హీరోయిన్ పాత్రల పరిచయం, వారి ప్రేమతో సాగుతుంది. ఇది యూత్ కి బాగా కనెక్ట్ అవుతుంది. ప్రీ ఇంటర్వెల్ లో మలుపు బాగుంది.  
 
ఇక సెకండ్ హాఫ్ లో అసలు కథ చెప్పాలి కాబట్టి, ఆత్మ ఎవరిదీ. ఆమె ఎందుకు పగతో ఉంది, సెక్యూరిటీ గార్డ్ ఆ ఆత్మకు ఎలా సపోర్ట్ చేసాడు అనేది చాలా ఇంట్రెస్టింగ్ గా చూపించారు. సినిమా అంతా హారర్ ఎలిమెంట్స్ తో బాగా భయపెట్టారు. హీరో - హీరోయిన్ ప్రేమ కథ ఎంగేజింగ్ గా వుంటుంది. హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ తో నవ్వించే ప్రయత్నం చేసారు. క్లైమాక్స్ లో పార్ట్ 2 కి లీడ్ ఇవ్వడం గమనార్హం. కథ అంతా ఆస్ట్రేలియాలో జరగడం వల్ల అక్కడ నేటివిటీ ఎక్కువుగా కనిపిస్తుంది. ఎక్కువగా ఇంగ్లీష్ డైలాగ్స్ ఉండటంతో యూత్ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుంది.
 
నటుడిగా, విరాజ్ రెడ్డి చీలం కొత్తవాడైనా బాగా చేసాడు. మిమీ లియానార్డ్ అందాలు ఆరబోస్తూనే దయ్యం పట్టిన పాత్ర బాగా డీల్ చేసింది.  అలాగే శిల్ప బాలకృష్ణన్ కూడా తన నటనతో మెప్పించింది. హీరో ఫ్రెండ్ పాత్రలో నటించిన నటుడు అక్కడక్కడా నవ్వించాడు. నెగిటివ్ షేడ్స్ లో కమల్ కృష్ణ పర్ఫెక్ట్ గా సెట్ అయ్యాడు. మిగిలిన నటీనటులు కూడా వారి పాత్రల్లో నటించి మెప్పించారు. 
 
సాంకేతికంగా చూస్తే, సినిమాటోగ్రఫీ విజువల్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో బాగా భయపెట్టారు. ఉన్న ఒక్క పాట కూడా బాగుంది. కథ,. కథనం కొత్తగా చూపించి భయపెట్టడంలో దర్శకుడు సక్సెస్ అయ్యాడు. నిర్మాణ పరంగా కూడా కావాల్సినంత ఖర్చుపెట్టారు. అయితే, గత సినిమాలతో పోలిక లేకుండా సరికోత్హగా చేసినా చిన్నపాటి లోపాలు సరిచేస్తే బాగుండేది. భయపెట్టే వర్మ లాంటి సినిమా తరహేలో కోత్హగా ఉంది.
రేటింగ్: 2.75/5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

మహారాష్ట్రలో బైలింగ్వల్ యాక్షన్ డ్రామా డకాయిట్ షూటింగ్