Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

యువత ఆలోచనల నేపథ్యం లో తకిట తధిమి తందాన -రివ్యూ

Advertiesment
Takita Tadhimi Tandana poster

దేవి

, శుక్రవారం, 28 ఫిబ్రవరి 2025 (16:06 IST)
Takita Tadhimi Tandana poster
నటీనటులు: గణాదిత్య, ప్రియ కొమ్మినేని, . గంగవ్వ, సతీష్ సారిపల్లి తదితరులు
సాంకేతికత: ప్రొడ్యూసర్ : చందన్ కుమార్, దర్శకుడు : రాజ్ లోహిత్, బేనర్: ఎల్లో మ్యాంగో ఎంటర్‌టైన్‌మెంట్, విడుదల:  సినెటేరియా మీడియా వర్క్స్. ఎడిటింగ్ : హరిశంకర్,  సంగీతం:. నరేన్ రెడ్డి. 
 
కథగా చెప్పాలంటే,  ఓవర్ కాన్ఫిడెన్స్, ఫాల్స్ ప్రెస్టేజ్ తో లేనిపోని కష్టాలు కొని తెచ్చుకునే కుర్రాడి కథ తకిట తధిమి తందాన. పెద్ద మొత్తంలో నెలనెలా జీతం అకౌంట్ లో క్రెడిట్ అయిపోతుందనే భ్రమలో, కలల్లో విహరించే కుర్రాళ్లకు ఆలోచింపజేసే కథ. ఫిబ్రవరి 27న ఈరోజే విడుదలైన సినిమా గురించి తెలుసుకుందాం.
 
గణాదిత్య  పాత్ర నేటి తరానికి ప్రతినిధిలా ఉంది. అందులో సరిపోయాడు. ఇంతకుకుండు రామ్ గోపాల్ వర్మ "మర్డర్, "సమ్మేళనం" అనే వెబ్ సిరీస్ లో నటించాడు. హవాభావాలు మెరుగు చేసుకుంటే మంచి అవుతాడు.  తెలుగమ్మాయి ప్రియ కొమ్మినేని పాత్ర తీరు పర్వాలేదు. మరింతగా నటనలో కష్టపడితే భవిష్యత్ ఉంటుంది.  గంగవ్వ కనిపించేది కాసేపే అయినా కథకు హెల్పయ్యే పాత్ర. హీరోయిన్ తండ్రి పాత్రధారి సతీష్ సారిపల్లి కూడా మంచి మార్కులే స్కోర్ చేస్తాడు. నిర్మాత చందన్ ఇందులో ఓ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ గా కనిపిస్తారు  చాలా నేచురల్ గా చేసారు.. హరిశంకర్ ఎడిటింగ్ ఈ చిత్రానికి ఎస్సెట్. నరేన్ రెడ్డి సంగీతం పర్వాలేదు అనిపిస్తుంది. 
 
ఇక   కథ,  సంభాషణలు సమకూర్చుకున్న దర్జ్శకుడు  లోహిత్, రచయితగా కూడా తన ప్రతిభ చూపాడు. అయితే  దర్శకుడిగా  కొన్ని సన్నివేశాల్లో  తడబడ్డాడనిపిస్తుంది. నేరేషన్ లో స్పీడ్ పెంచి, ఆడియో క్వాలిటీపరంగా కేర్ తీసుకుని  హీరో-హీరోయిన్ మధ్య ఇంకొంచెం కెమిస్ట్రీ, ఎమోషన్స్ వర్కవుట్ అయ్యేలా జాగ్రత్తలు తీసుకుని ఉంటే ఈ చిత్రం మరింత బాగుండేది. అయితే చిన్న చిత్రాలకుండే బడ్జెట్ పరిమితులు, ప్రాక్టికల్ డిఫికల్టీస్ గురించి కూడా ఆలోచించినప్పుడు.. దర్శకుడిగానూ అతన్ని మెచ్చుకోవచ్చు. హీరో ఏ ఫాల్స్ ప్రెస్టేజ్ తో అప్పులు పాలయ్యాడో... ఆ ఫాల్స్ ప్రెస్టేజ్ ని పక్కన పెట్టి, వేరే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే, తాత్కాలిక ఉపశమనం కోసం "స్విగ్గి బాయ్" అవతారం ఎత్తడం వంటివి నేటి యువత మారాలని దర్శకుడి చెప్పిన అంశం బాగుంది. 
 
నిర్మాత చందన్ కుమార్ కొప్పుల, తన తొలి ప్రయత్నంలొనే యువత కోసం తెసిన సినిమా ఇద.  దర్శకుడిగా,  హీరోయిన్ గా కోత్హవారిని  పరిచయం చెయ్యడం  అభినందనీయం. వినోదంతోపాటు చిన్న సందేశాన్ని జోడించారు.ఒక క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ప్రొడ్యూసర్ గా ఎంట్రీ ఇచ్చిన చందన్ నుంచి కచ్చితంగా మరిన్ని మంచి చిత్రాలు ఆశించవచ్చు. క్లీన్ యూత్ ఫుల్ ఎంటర్టైనర్ తో ఆలోచింపజేస్తూనే ఆనందింపజేసే చిత్రంగా మలిచారు. కొత్త వారు కనుక చిన్న చిన్న లోపాలను సరిదిద్దుకుంటే మరిన్ని మంచి సినిమాలు రాగలవు.
రేటింగ్: 2.75 /5

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

థ్రిల్లర్‌, సందేశాన్ని, అవగాహనను కల్పించేలా సుడల్ సీజన్ 2