Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ కూడా బీఎండబ్ల్యూ ఉంటుంది : విరాజ్ రెడ్డి చీలం

Advertiesment
Viraj Reddy

దేవి

, గురువారం, 27 ఫిబ్రవరి 2025 (18:55 IST)
Viraj Reddy
సినిమా అనేది వ్యాపారం. నా మూవీని ఎవ్వరూ సపోర్ట్ చేయకపోయినా.. నాకు నేనే రిలీజ్ చేసుకుంటాను అని ఈవెంట్లలో ఆల్రెడీ చెప్పాను. నాకు నేనుగా, నా ప్యాషన్‌తో ఇక్కడి వరకు వచ్చాను. సినిమాను కూడా నేనే రిలీజ్ చేసుకుంటాను అని గార్డ్ చిత్ర హీరో విరాజ్ రెడ్డి చీలం అన్నారు.
 
అను ప్రొడక్షన్స్‌లో రివెంజ్ ఫర్ లవ్ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తున్న ఈ చిత్రం ఫిబ్రవరి 28న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో మిమీ లియానార్డ్, శిల్పా బాలవ కృష్ణ కథానాయికలుగా నటించారు. జగ పెద్ది దర్శకత్వంలో అనసూయ రెడ్డి ఈ సినిమాను నిర్మించారు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా హీరో విరాజ్ రెడ్డి చీలం పలు విషయాలు తెలిపారు.
 
* మాది నిజామాబాద్. ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియాకు వెళ్లి సెటిల్ అయ్యాను. చిన్నప్పటి నుంచీ నాకు సినిమాలంటే ఇష్టం. అక్కడే యాక్టింగ్ స్కూల్‌కు వెళ్లాను. ఈ మూవీ మొత్తాన్ని కూడా ఆస్ట్రేలియాలోనే షూట్ చేశాం. నేను అక్కడే ఉండే వాడ్ని కాబట్టి అక్కడ షూట్ చేశాం. కరోనా తరువాత ఈ మూవీని చేశాం. కొత్త వాళ్లే అయినా కూడా అంతా ట్రైనింగ్ తీసుకున్న యాక్టర్లతోనే ముందుకు వెళ్లాం.
 
* ఆస్ట్రేలియాలో సినిమా తీశాం. కానీ స్టోరీ మాత్రం మనదే. తెలుగు వాళ్ల వైబ్ ఎలా ఉంటుందో సినిమా కూడా అలానే ఉంటుంది. కాకపోతే ఆస్ట్రేలియా ఫ్లేవర్ ఉంటుంది. అక్కడి ఓ సెక్యురిటీ గార్డ్ లైఫ్ ఎలా ఉంటుందో చూపించాను. ఇక్కడ సెక్యురిటీ గార్డ్ లైఫ్ వేరేలా ఉంటుంది. కానీ ఆస్ట్రేలియాలో సెక్యురిటీ గార్డ్ అన్నా కూడా బీఎండబ్ల్యూ కూడా ఉంటుంది.
 
* హారర్, యాక్షన్, కామెడీ, రివేంజ్ ఇలా అన్ని అంశాలతో ఈ మూవీని తీశాం. ముఖ్యంగా హారర్ కామెడీ, రివేంజ్ డ్రామా అని చెప్పొచ్చు. ఈ కథలో అన్ని రకాల అంశాలుంటాయి. పూర్తిగా హీరోయిజం చూపించే పాత్ర కాదు. కథకు తగ్గట్టుగా అన్ని రకాల ఎమోషన్స్‌ను చూపించాల్సి ఉంటుంది. ఓ కొత్త హీరోకి ఇంత కంటే మంచి డెబ్యూ దొరకదు. టీజర్, ట్రైలర్ చూసిన వారంతా మెచ్చుకున్నారు
 
* ప్రస్తుతం ఈ మూవీని తెలుగులో రిలీజ్ చేస్తున్నాం. కానీ ఓటీటీ కోసం అని ముందుగానే అన్ని భాషల్లో ఈ చిత్రం రెడీ చేసి పెట్టాను. ఒక వేళ సినిమాకు మంచి టాక్ వస్తే.. ఇతర భాషల్లో మూవీని రిలీజ్ చేస్తామని ఎవరైనా ముందుకు వస్తే కూడా ఇస్తాను. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

Akshay Kumar : కన్నప్ప ఆఫర్ రెండు సార్లు తిరస్కరించాను.కానీ...: అక్షయ్ కుమార్