Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

Aacharya movie review: కొరటాల మార్క్ స్టోరీ.. అదుర్స్

Acharya
, శుక్రవారం, 29 ఏప్రియల్ 2022 (09:35 IST)
ఆచార్య చిత్రం అభిమానుల భారీ అంచనాల మధ్య ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో రిలీజ్ ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అమెరికాతో పాటు దేశవ్యాప్తంగా ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ రిపోర్ట్ బయటకు వచ్చింది.
 
ఆచార్య సినిమా ప్రపంచ వ్యాప్తంగా థియేటర్లలో విడుదల అయ్యింది. ఈ సినిమా రివ్యూ అండ్ హైలైట్స్ ఏంటో చూద్దాం.. ధర్మస్థలి గురించి సూపర్ స్టార్ మహేష్ బాబు వాయిస్ ఓవర్‌తో ఆచార్య మొదలవుతుంది. ఆ తర్వాత సోనుసూద్ ఎంట్రీతో చిరంజీవి ఇంట్రో సీన్‌కు రంగం సిద్ధం అవుతుంది. 
 
స్టైలిష్‌గా, సింపుల్‌గా మెగాస్టార్ చిరంజీవి ఎంట్రీతో అసలు కథ మొదలవుతుంది. ధర్మస్థలి ప్రాంతంలో లాహే లాహే పాటతో అసలు కిక్కు ప్రారంభమవుతుంది.
 
మెగాస్టార్ స్క్రీన్ ప్రజెన్స్, స్టయిల్‌గా చేసిన ఫైట్ సీక్వెన్స్ ఫ్యాన్స్‌తో ఈలలు వేయిస్తాయి. చిరంజీవి ఫైట్ తర్వాత పూజా హెగ్డే నీలాంబరి క్యారెక్టర్ ఎంట్రీ ఇస్తుంది. ఆ తర్వాత కథలో భాగంగా సినిమాలోని పాత్రలు తెరపైకి వస్తాయి.
 
ఆచార్య ఫస్టాఫ్ ముగింపుకు కొద్ది నిమిషాల ముందు రాంచరణ్ పాత్ర సిద్దా ఎంట్రీ ఇస్తుంది. రాంచరణ్ ఫైట్‌తో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభమవుతుంది. రెజీనా కసండ్రాతో సానా కష్టం వచ్చింది అనే స్పెషల్ సాంగ్ మొదలవుతుంది. ఈ పాటలో రెజీనా గ్లామర్‌గా కనిపించింది. చిరంజీవి స్టెప్పులు మెస్మరైజింగ్‌గా ఉంటాయి.
 
ఇంటర్వెల్‌కు ముందు చిరంజీవి, సోనుసూద్ మధ్య భీభత్సమైన ఫైట్ సీన్ ఉంటుంది. సిద్దా క్యారెక్టర్ ఎంట్రీతో సెకండాఫ్ మొదలవుతుంది. చిరంజీవి, రాంచరణ్ మధ్య ఆసక్తికరమైన సన్నివేశాలు ఎమోషనల్‌గా కనిపిస్తాయి. కొన్ని సీన్ల తర్వాత చిరంజీవి, రాంచరణ్ మధ్య భలే భలే బంజారా పాట ఫ్యాన్స్ పిచ్చెక్కించేలా ఉంటుంది.  
 
ఆచార్య క్లైమాక్స్ హై ఓల్టేజ్‌గా, పవర్‌ఫుల్‌గా వుంటుంది.  పవర్‌ఫుల్ డైలాగ్స్, చిరంజీవి యాటిట్యూడ్, స్క్రీన్ ప్రజెన్స్ అద్బుతంగా ఉంటుంది. ఓ బలమైన సీన్‌తో ఆచార్య సినిమాకు తెర పడుతుంది.
 
ఈ సినిమా చూసిన కొందరు ట్విట్టర్ లో పంచుకున్నారు. చొక్కా విప్పేసేలా సీన్లు ఉన్నాయని.. సెకండాఫ్ అదిరిపోయిందని.. ఫైట్స్, పాటలు, క్లైమాక్స్ లో చిరు విశ్వరూపం మామూలుగా ఉండదని అన్నారు. 
 
బట్టలు చించుకోవాల్సిందే.. కొరటాల మార్క్ స్టోరీ టెల్లింగ్ సూపర్ అంటున్నారు. ఈ సినిమా సూపర్ హిట్ అని ఓ నెటిజన్ ట్వీట్ చేశారు. ఇక ఈ సినిమా కథ పూర్తిగా తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్‌లో మరో విషాదం: బట్టలు ఆరేస్తుండగా జారిపడి దర్శకుడు మృతి