ఇప్పుడు చిరంజీవి ఆచార్య సినిమా గురించే అంతా చర్చ. అపజయం ఎరుగని దర్శకుడు కొరటాల దర్శకత్వంలో వస్తోన్న చిత్రం కావడంతోపాటు చిరంజీవిని, రామ్‌చరణ్‌ను ఆయన దర్శకత్వం వహించడం సినిమా ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. అయితే ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి వుండగా కరోనా వల్ల ఆలస్యమైంది. ఎట్టకేలకు ఏప్రిల్ 29న విడుదల కాబోతోంది.
ఇంకా ఒక్కరోజే విడుదలకు సమయం వున్నందున అన్ని ప్రమోషన్‌లు పూర్తిచేసింది చిత్ర యూనిట్. అయితే తాజాగా సెన్సార్ బోర్డు నుంచి వచ్చిన రిపోర్ట్‌ను ఉమైర్ సందూ వివరిస్తూ, ఇది పైసా వసూల్ అని పేర్కొంటున్నాడు. చిరంజీవి, రామ్‌చరణ్ నటనపై ప్రశంసలు కురిపించాడు. ఆచార్య సినిమా మాస్‌ను అలరించే చిత్రంగా వుంటుందని చెప్పాడు. చిరంజీవి, రామ్‌చరణ్ కలయిక చాలా ఆసక్తిగా వుంటుందని పేర్కొన్నాడు.
ఇంతకుముందు ఆర్.ఆర్.ఆర్., భీమ్లానాయక్ వంటి సి నిమాలకు ఆయన విడుదలకు ముందే రివ్యూలు ఇచ్చాడు. అయితే భీమ్లానాయక్ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అన్నాడు. కానీ అది కాలేదు. అప్పుడే ఆయనపై పవన్ అభిమానులు ఉమైర్ సందూ విశ్లేషణలు అన్ని నిజంకావని తేల్చేశారు. మరి ఆచార్య గురించి ఏమి జరుగుతుందో చూడాలి.