బ్లాక్‌బస్టర్ కంటెంట్‌తో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తెలుగు ఓటీటీ మాధ్యమం ఆహా మెయిల్, లెవన్త్ అవర్, థాంక్యూ బ్రదర్ వంటి సూపర్ హిట్స్ తర్వాత హార్డ్ హిట్టింగ్ ఇన్‌టెన్స్ వెబ్ సిరీస్ ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్(ఐఎన్‌జీ) తో ప్రేక్షకులను మెప్పించడానికి సిద్ధమవుతుంది. ప్రియదర్శి, నందినీ రాయ్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రల్లో నటించారు. భాషా, ప్రేమ, మాస్టర్ చిత్రాల దర్శకుడు సురేష్ కృష్ణ ఈ వెబ్ సిరీస్‌ను నిర్మించడం విశేషం. ఆటో శంకర్ వంటి బహుభాషా వెబ్ షోస్‌ను రూపొందించిన రంగా యాలి ఈ వెబ్ సిరీస్‌కు షో రనర్‌గా వ్యవహరిస్తున్నారు. విద్యాసాగర్ ముత్తుకుమార్ ఈ ఏడు ఎపిసోడ్స్ వెబ్ సిరీస్‌ను డైరెక్ట్ చేశారు. వరుణ్ డీకే సినిమాటోగ్రఫీ అందించిన ఈ వెబ్ సిరీస్‌ను రాజమండ్రి, మారేడు మిల్లి, హైదరాబాద్‌లలో చిత్రీకరించారు.
ఈ సందర్భంగా నిర్మాత సురేష్ కృష్ణ మాట్లాడుతూ, అల్లు అరవింద్‌గారి ఆలోచనా విధానంతో ఆహా అతి తక్కువ వ్యవథిలోనే మంచి పాపులారిటీని సంపాదించుకుని అభివృద్ధిని సాధించింది. అరవింద్‌గారు ఈ వెబ్ సిరీస్‌ను నన్నే నిర్మించమని అన్నారు. ఆ సమయంలోక్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌డ్రాప్‌తో డైరెక్టర్ విద్యాసాగర్ చెప్పిన కథ బాగా నచ్చింది. అలా ఈ ప్రాజెక్ట్ రూపొందింది. దర్శకుడిగా వర్క్ చేసిన నాకు నిర్మాతగా ఈ జర్నీ చాలా కొత్తగా అనిపించింది. ప్రియదర్శి ఇప్పటి వరకు చూసిన పాత్రలకు భిన్నమైన పాత్రను ఈ వెబ్ సిరీస్‌లో చూస్తారు. తనలో మంచి ఇన్‌టెన్స్ ఉన్న నటుడున్నారు. అన్ని ఎలిమెంట్స్‌తో కంప్లీజ్ ప్యాకేజ్‌తో ఈ వెబ్ సిరీస్ సాగుతుంది అన్నారు.
అల్లు అరవింద్ మాట్లాడుతూ 90 ప్రాంతంలో నేను రజినీకాంత్‌గారి భాషా సినిమా చూసినప్పుడు ఆశ్చర్యపోయాను. ఆ సమయంలో ఆయనతో పనిచేయాలనుకున్నాను. చివరకు మా బ్యానర్‌లో ఆయనతో మాస్టర్, డాడీ చిత్రాలను డైరెక్ట్ చేశారు. ఓ సందర్భంలో ఆయనకు ఫోన్ చేసి ఆహా కోసం ఏదైనా చేయాలని కోరాను. ఆ సమయంలో చాలా మంది కొత్త టాలెంట్ ఉన్న యంగ్ జనరేషన్ కథలతో తనను కలుస్తున్నారని చెప్పాడు. అప్పుడు నేను ఓ ప్రాజెక్ట్‌ను నిర్మించమని చెప్పాను. అలా సురేష్ కృష్ణగారు ఇన్‌ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్‌కు ఆయన నిర్మాతగా వ్యవహరించారు. ప్రియదర్శిఇందులో చాలా కొత్తగా కనిపిస్తాడు. నేను రెండు ఎసిసోడ్స్‌ను మాత్రమే చూశాను. నాకు ప్రియదర్శి నటనలో ఓ ఇన్‌టెన్సిటీ కనిపించింది. అలాగే నందినీ రాయ్ చాలా గ్లామర్‌గా కనిపించడమే కాకుండా, మంచి పెర్ఫామెన్స్ ఉన్న పాత్రలో నటించింది. సినిమాటోగ్రాఫర్ వరుణ్ కంటెంట్‌కు తగినట్టు మంచి విజువల్స్‌ను అందించాడు. మరి ఈ వెబ్ సిరీస్ గురించి ఆడియెన్స్ ఏమనుకుంటారోననే ఆసక్తి నాలోనూ ఎక్కువగా ఉంది అన్నారు.
ప్రియదర్శి మాట్లాడుతూ నాకు ఆహాతో మంచి అనుబంధం ఏర్పడింది. ఆహాలో విడుదలైన మెయిల్‌లో హైబత్ అనే మంచి పాత్ర చేశాను. అప్పటి నుంచి మంచి అనుబంధం ఉంది. జాతిరత్నాలు సక్సెస్ అయిన తర్వాత యు.ఎస్ టూర్ వెళ్లాం. అక్కడ చాలా మంది మెయిల్‌లో హైబత్ రోల్ బావుందని అప్రిషియేట్ చేశారు. అలాగే ఇప్పుడు ఇన్ ది నేమ్ ఆఫ్ ది గాడ్ వెబ్ సిరీస్‌తో వస్తున్నాను. ఇప్పటి వరకు చూడనటువంటి ఇన్‌టెన్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నాను. మరి ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందోనని ఆసక్తిగా ఉంది. అల్లు అరవింద్ సహా సురేష్ కృష్ణ వంటి లెజెండ్‌తో ఈ ప్రాజెక్ట్‌కు పని చేయడం మంచి అనుభూతి. నా కల నిజమైంది. డైరెక్టర్ విద్యాసాగర్ నన్ను చాలా కొత్తగా చూపించాడు. అందుకు అతనికి, రంగాకు థాంక్స్. నందినీ రాయ్ వంటి మంచి కోస్టార్‌తో కలిసి పనిచేయడం గుడ్ ఎక్స్‌పీరియెన్స్ అన్నారు.
ఇళ్లలోకే ఎంటర్‌టైన్‌మెంట్‌ను తీసుకొస్తానని ప్రామిస్ చేసిన ఆహా! క్రాక్, గాలి సంపత్, నాంది, జాంబి రెడ్డి, సుల్తాన్, చావు కబురు చల్లగా వంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో పాటు వెబ్ షోస్, సిరీస్, ఒరిజినల్స్‌తో తన మాటను నిలబెట్టుకుంటోంది.