ఉప్పెన ఫేమ్ విజయ్ సేతుపతికి బంపర్ ఆఫర్లు వస్తున్నాయి. ఈ సూపర్ హీరో సరసన టాప్ హీరోయిన్లు పోటీపడేందుకు సై అంటున్నారు. ఈ సినిమా ద్వారా కత్రినా కైఫ్ కోలీవుడ్లోకి ఎంట్రీ ఇస్తుందని టాక్. ఈ చిత్రానికి 'మెర్రీ క్రిస్మస్' అనే టైటిల్నే ఖరారు చేసినట్లు నిర్మాత రమేష్ తౌరుని వెల్లడించారు.
ఇక ఈ మూవీ అనౌన్స్ చేసిన నాటి నుంచి ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. విజయ్ సేతుపతి- కత్రినా మొదటిసారి నటిస్తుండటంతో మరింత హైప్ క్రియేట్ అయ్యింది.
అంధదూన్ దర్శకుడు శ్రీ రామ్ రాఘవన్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. జూన్లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం వున్నట్లు తెలుస్తోంది.