అరేబియా సముద్రంలో ఏర్పడిన తౌటే తుఫాన్ తీరానికి చేరువ కావడంతో ముంబై తీరంలో వాతావరణం భయానకంగా మారింది. సముద్రం అల్లకల్లోలంగా మారడంతో తీరం వెంబడి రాకాసి అలలు ఉవ్వెత్తున ఎగిసిపడుతున్నాయి. దాదాపు 20 అడుగుల ఎత్తున అలలు ఎగిసిపడుతూ పరిస్థితిని భీతావహంగా మార్చేశాయి.
అలాగే ముంబైలో తుఫాన్ ధాటికి పలుచోట్ల వృక్షాలు కూలిపోయాయి. కరెంటు స్తంభాలు విరిగిపడ్డాయి. శివసేన భవన్ సమీపంలో కూడా గాలివాన ధాటికి కరెంటు స్తంభం విరిగిపడింది. పలు చెట్లు కూలిపోయాయి.
దాంతో ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వెంటనే రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపడుతున్నారు. కాగా, ముంబై తీరంలోని మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో అలల ఉర్రడిని ఈ కింది వీడియోలో చూడవచ్చు.