అతడిని అందుకే వదిలేశా... కాజల్ అగర్వాల్

బుధవారం, 19 జూన్ 2019 (14:46 IST)
ప్రేమికుడితో చనువుగా వుండలేదని.. తన ప్రేమ విఫలమైందని టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ వెల్లడించింది. దక్షిణాది హీరోయిన్‌గా ముద్ర వేసుకున్న కాజల్ అగర్వాల్.. ఓ ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి చెప్పుకొచ్చింది. ప్రస్తుతం కమల్ హాసన్‌తో ఇండియన్-2 సినిమాలో నటిస్తున్న కాజల్ అగర్వాల్... తన  లవ్ ఫెయిల్యూర్ గురించి చెప్పుకొచ్చింది. 
 
సినిమాల్లోకి రాకముందే కాజల్ అగర్వాల్ ప్రేమ విఫలమైందట. ఆ ప్రేమ విఫలమయ్యాక సినిమాల్లోకి వచ్చానని చెప్పుకొచ్చింది. సినిమాల్లో దూసుకుపోతున్న సమయంలో కాజల్ అగర్వాల్‌ను ఓ వ్యక్తి ప్రేమించాడట. కానీ అతడికి సినిమా రంగం నచ్చలేదు. సినిమాల్లో నటించడం, సినిమా షూటింగ్‌లో పాల్గొనడం ద్వారా ప్రేమికుడి కోసం సమయం కేటాయించలేకపోవడం ద్వారా ఆ ప్రేమ కొనసాగలేదు. ఒక రకంగా ఆలోచిస్తే... అతడు అంత మెచ్యూరిటీ మేన్ కాదనిపించింది. ప్రేమలో అమ్మాయితో పాటు ఆమె చేసే పనులను కూడా ప్రేమించాలి కదా.
 
ప్రేమకు ముఖ్యం ప్రేమికులు ఒకరినొకరు చూస్తూ.. అప్పుడప్పుడు కలవడం వంటివే. కానీ అలాంటి అవకాశాలు లేకపోవడం వల్లే ప్రేమికుడు తనకు దూరమయ్యాడని కాజల్ చెప్పుకొచ్చింది. అతనితో చనువుగా వుండలేకపోవడం.. అతనితో కలిసి చెట్టాపట్టాలేసుకుని తిరగకపోవడం వల్లే తన ప్రేమ అప్పుడు విఫలమైందని కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది.

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం త‌ప్పు తెలుసుకున్న కార్తికేయ‌... గుణ 369 అయినా ఆశ నెర‌వేర్చేనా..?