`ఆర్.ఎక్స్.100` ఫేమ్ కార్తికేయ నటించిన తాజా చిత్రం హిప్పీ. ఈ సినిమాపై కార్తికేయ చాలా ఆశలు పెట్టుకున్నాడు. ఈ సినిమాతో కూడా బిగ్ సక్సస్ సాధించాలి అనుకున్నాడు. కానీ... హిప్పీ థియేటర్స్‌లోకి ఇలా వచ్చి అలా వెళ్లిపోయింది. దీంతో తను చేసిన తప్పు ఏంటో బాగా తెలుసుకున్నాడట. అవకాశం వచ్చింది.. రెమ్యూనరేషన్ బాగా ఇస్తున్నారు కదా అని కథ విషయంలో కేర్ తీసుకోకుండా ఒప్పేసుకుంటే ఇలాగే ఉంటుందని తెలుసుకున్నాడట కార్తకేయ.
ప్రస్తుతం గుణ 369 అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా టీజర్ రిలీజ్ అయ్యింది. ఇకపై అందరూ `గుణ 369` హీరో కార్తికేయ అని అనడం ఖాయం... అని ఘంటాపథంగా చెబుతున్నారు `గుణ 369` చిత్రం టీజర్ చూసిన వాళ్లు`` అని అంటున్నారు శ్రీమతి ప్రవీణ కడియాల. ఆమె సమర్పిస్తున్న చిత్రం `గుణ 369`. అనిల్ కడియాల, తిరుమల్ రెడ్డి నిర్మాతలు. అర్జున్ జంధ్యాలకు దర్శకుడిగా ఇదే తొలి చిత్రం.
``మనం చేసే తప్పుల వల్ల మన జీవితానికి ఏం జరిగినా ఫర్వాలేదు. కానీ పక్కనోడి జీవితానికి ఏ హానీ జరగకూడదు`` అని సాయికుమార్ గంభీరమైన స్వరంతో చెప్పే మాటలతో `గుణ 369` టీజర్ విడుదలైంది.
టీజర్ రిలీజైన కొద్దీ క్షణాల్లోనే నెట్టింట్లో ట్రెండ్ అయింది. ఆరడగుల హీరో ఓ అమ్మాయి ముందు నిలుచుని `స్మైల్ ఇవ్వొచ్చు కదా ఒక్క సెల్ఫీ..`, `నేనూ ఎప్పుడూ అనుకోలేదండీ. ఇలా బలవంతంగా షట్టర్ క్లోజ్ చేసి ఒకమ్మాయితో మాట్లాడతాననీ.. నాతో మీరు మాట్లాడాల్సిన పనిలేదు. మీతో మీరు మాట్లాడేయండి` అని ప్రేమను వ్యక్తం చేస్తూ చెప్పే డైలాగులు యూత్‌ను అట్రాక్ట్ చేస్తున్నాయి.
`మాలాంటి వాళ్లు మీలాంటి వాళ్లను చూసి భయపడేది, గొడవలంటే మూసుకుని కూర్చునేది మాకేదన్నా అవుతుందని కాదు. మా అనుకున్న వాళ్లకు ఏదన్నా అవుతుందన్న చిన్న భయంతో...` అని టీజర్‌లో ఆఖరిగా హీరో నోటి వెంట వచ్చే డైలాగులు మాస్ జనాల చేత చప్పట్లు కొట్టిస్తున్నాయి. ఈ సినిమా పై కార్తికేయ చాలా ఆశలు పెట్టుకున్నాడు. మరి.. గుణ 369 అయినా కార్తికేయకు విజయాన్ని అందిస్తుందో లేదో..? చూడండి టీజర్...