Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

''హిప్పీ'' గోవిందా.. ''గుణ 369''తో కార్తీకేయ (ట్రైలర్)

Advertiesment
vKarthikeya Guna 369 Teaser
'హిప్పీ' ఫలితంతో డీలాపడిపోయిన కార్తికేయ ప్రస్తుతం ''గుణ 369''తో వస్తున్నాడు. అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో కార్తికేయ హీరోగా 'గుణ 369' రూపొందుతోంది. అనిల్ కడియాల - తిరుమల్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ సినిమాకి చైతన్ భరద్వాజ్ సంగీతాన్ని సమకూర్చారు. తాజాగా ఈ సినిమా నుంచి టీజర్ విడుదలై.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. 
 
ఈ టీజర్‌లో కార్తీకేయ స్మార్ట్‌గా కనిపిస్తున్నాడు. ఈ టీజర్ చివరిలో కార్తికేయ చెప్పిన ఎమోషనల్ డైలాగ్ హైలైట్‌గా నిలుస్తోంది. లవ్, యాక్షన్, ఎమోషన్‌కి సంబంధించిన సన్నివేశాలపై కట్ చేసిన ఈ టీజర్ యువతను బాగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమా ద్వారా కొత్త హీరోయిన్ పరిచయమవుతోంది.

ఇకపోతే.. ''గుణ 369'' పోస్టర్ కూడా ఇటీవల విడుదలైంది. ఈ పోస్టర్‌లో కార్తీకేయ కండల వీరుడిగా కనిపించాడు. ఇంకేముంది.. తాజాగా విడుదలైన ''గుణ 369'' టీజర్‌ను ఓ లుక్కేయండి. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ఓ జర్నలిస్టూ.. ఓ నువ్వూ ఓ తల్లికేగా పుట్టి వుంటావ్?: రేణూ దేశాయ్