'వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి' అంటూ అంతా విప్పిచూపిన రత్తాలు (టీజర్)

బుధవారం, 6 ఫిబ్రవరి 2019 (20:00 IST)
లక్ష్మీరాయ్ అలియాస్ రాయ్ లక్ష్మి... ఖైదీ నంబర్ 150 చిత్రంలో రత్తాలు .. రత్తాలు అంటూ తెలుగు ప్రేక్షకులను ఓ ఊపు ఊపింది. ప్రస్తుతం ఈమె వేర్ ఈ ది వెంకటలక్ష్మి అనే చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రానికి కృష్ణ కిషోర్ దర్శకత్వం వహిస్తున్నాడు. సస్పెన్స్, థ్రిల్లింగ్ అంశాలను కలగలిపి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 
 
ఏబీటీ క్రియేషన్స్ ప్రొడక్షన్ నెం.1లో ఈ సినిమాని నిర్మాత‌లు గురునాథ్ రెడ్డి, ఆనంద్ రెడ్డిలు నిర్మిస్తున్నారు. ఔట్ అండ్ ఔట్ కామెడీ చిత్రం గా కూడా 'వేర్ ఈజ్ వెంకట లక్ష్మి' ఉంటుంద‌ని తెలుస్తుండ‌గా, తాజాగా చిత్ర టీజ‌ర్ విడుద‌ల చేశారు. ఇందులో రాయ్ ల‌క్ష్మీ అందాల‌ని చూపిస్తూ యూత్‌కి మాంచి కిక్కిస్తుంది. ఈ చిత్రంలో రామ్ కార్తిక్ హీరోగా న‌టిస్తుండగా.. పూజిత పొన్నాడ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది. హ‌రి గౌర చిత్రానికి సంగీతం అందిస్తున్నారు. మరి తాజాగా రిలీజ్ చేసిన ఈ చిత్రం టీజర్‌ను మీరూ చూసి ఎంజాయ్ చేయండి.
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం హీరో వెంకీ కుమార్తెకు నిశ్చితార్థం?