Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

లక్ష్మీ రాయ్ 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి' ఎంతవ‌ర‌కు వ‌చ్చింది..?

webdunia
గురువారం, 31 జనవరి 2019 (16:31 IST)
లక్ష్మీ రాయ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం 'వేర్ ఈజ్ వెంకటలక్ష్మి'. రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ జంటగా నటిస్తున్న ఈ చిత్రానికి కిషోర్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. హార్రర్ కామెడీగా  తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శ‌రవేగంగా జరుగుతున్నాయి. కాగా ఇటీవలే ఈ చిత్రం నుంచి వచ్చిన 'పాపా నీకేదంటే ఇష్టం' పాటకు ప్రేక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తుంది. మాస్ హంగులు జోడించి ఈ పాటను చిత్రీకరించారు.
 
ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్‌కి మంచి రెస్పాన్స్ రాగా, త్వరలో టీజర్ రిలీజ్ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు నిర్మాతలు. ఈ చిత్రంలో నటిస్తున్న హాస్యనటులు ప్రవీణ్, మధునందన్‌ల కామెడీ హైలైట్‌గా నిలవనుంది. 
 
హరి గౌర ఈ చిత్రానికి సంగీతం అందించగా, వెంకట్ ఆర్.శాఖమూరి సినిమాటోగ్రఫీ ని అందించారు.. ఏబీటి క్రియేషన్స్ బ్యానర్ పతాకంపై గురునాథ్ రెడ్డి సమర్పిస్తున్న ఈ సినిమాకి ఎం.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డిలు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. మార్చి నెలలో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. 
 
రాయ్ లక్ష్మీ, ప్రవీణ్, మధు నందన్, రామ్ కార్తిక్, పూజిత పొన్నాడ, బ్రహ్మాజీ, పంకజ్ కేసరి, అన్నపూర్ణమ్మ, జబర్దస్త్ మహేష్, జెమినీ సురేష్ తదితరులు న‌టిస్తోన్న ఈ చిత్రానికి దర్శకత్వం: కిషోర్ కుమార్, నిర్మాతలు: ఎం.శ్రీధర్ రెడ్డి, హెచ్.ఆనంద్ రెడ్డి, ఆర్కే రెడ్డి, బ్యానర్: ఏబీటి క్రియేషన్స్, సమర్పణ: గురునాథ్ రెడ్డి, సినిమాటోగ్రఫీ: వెంకట్ ఆర్.శాఖమూరి, మ్యూజిక్: హరి గౌర, కథ, కథనం, మాటలు: తాటవర్తి కిరణ్, ఎడిటర్: ఎస్.ఆర్. శేఖర్, ఆర్ట్: బ్రహ్మ కడలి, ఫైట్స్: రామ్ సుంకర, డాన్స్ మాస్టర్: శేఖర్, పీఆర్వో: వంశీ-శేఖర్.

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

సమంతకు నోటిదూల ఎక్కువా? దిల్ రాజు ఏమన్నారు?