Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఓటు అనేదే ఎన్నికల పండగ, కాదా! అని చెప్పే చిత్రం

Hrithik Shaurya, Tanvinegi, RP Patnaik
, శనివారం, 26 ఆగస్టు 2023 (16:54 IST)
Hrithik Shaurya, Tanvinegi, RP Patnaik
హృతిక్ శౌర్య హీరోగా పరిచయం అవుతున్నచిత్రం 'ఓటు'.  'చాలా విలువైనది' అనేది ట్యాగ్ లైన్.  ఫ్లిక్ నైన్ స్టూడియోస్ నిర్మాణంలో రవి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం ఫస్ట్ లుక్ మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా సంగీత దర్శకుడు ఆర్పీ పట్నాయక్ ఈ సినిమా టీజర్ ని విడుదల చేశారు.
 
‘మనదేశంలో కుల మత ప్రాంతీయ అభిప్రాయబేధాలు లేకుండా జరుపుకునే ఏకైక పండగ.. ఎన్నికల పండగ’ అనే డైలాగ్ తో మొదలైన టీజర్ ఆద్యంతం ఆకట్టుకుంది. టీజర్ లో పొలిటికల్ ఎలిమెంట్స్ తో పాటు ఫ్యామిలీ, లవ్ ఎమోషన్స్ కూడా అలరించాయి. ‘’మందుకు నోటుకు  ఓటు అమ్మకోవడం కరెక్ట్ కాదు కదా ? ఓటు అనేది హక్కు కాదు మన బాధ్యత’ లాంటి డైలాగులు ఆలోచింపచేసేలా వున్నాయి.    
 
హృతిక్ శౌర్య టీజర్ లో ప్రామిసింగ్ స్క్రీన్ ప్రజన్స్ తో ఆకట్టుకున్నారు.  అనుభవం వున్న నటుడిలా తన పాత్రలో ఒదిగిపోయారు. హృతిక్ శౌర్య, తన్వి నేగి కెమిస్ట్రీ కూడా బ్యూటీఫుల్ గా వుంది. గోపరాజు రమణ కీలక పాత్రలో కనిపించారు. నేపధ్య సంగీతం, కెమరాపనితనం ఆకట్టుకున్నాయి. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ వున్న ఈ టీజర్ సినిమాపై క్యురియాసిటీని పెంచింది.
 
ఆర్పీ పట్నాయిక్ మాట్లాడుతూ, ఈ సినిమా ద్వారా సమాజానికి ఇచ్చే సందేశం ఏమిటో టైటిల్ లోనే తెలుస్తుంది. ఓటుకు డబ్బులు అడుక్కునే స్థాయికి దిగజారిపోయే పరిస్థితి వున్న సమాజానికి వెన్నుతట్టి లేపాల్సిన అవసరం వుంది. అందుకు ఇలాంటి సినిమాలు రావాలి. ఇలాంటి సినిమాని నిర్మించిన చిత్ర బృందానికి అభినందనలు. పాటలు చక్కగా వున్నాయి. సిరిమల్లె పువ్వు పాట తో శ్రీదేవి గారికి ఎంతపేరు వచ్చిందో ఈ సినిమాలో అలాంటి పాటలో నటించిన తన్వి కూడా అలాంటి పేరురావాలని కోరుకుంటున్నాను. ఈ సినిమా మీ అందరికీ నచ్చాలని, సినిమాని సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాను.
 
హృతిక్ శౌర్య మాట్లాడుతూ.. టీజర్ ని లాంచ్ చేసిన ఆర్పీ పట్నాయిక్ గారికి కృతజ్ఞతలు. దర్శకుడు రవి గారు నాపై ఎంతో నమ్మకం పెట్టారు. ఆయనకి కృతజ్ఞతలు.చాలా ముఖ్యమైన కథ ఇది. గోపరాజు రమణగారు ఈ సినిమాలో కీలక పాత్ర చేయడం మాకు ఎంతో బలాన్ని ఇచ్చింది తెలిపారు
 
గోపరాజు రమణ మాట్లాడుతూ.. ఓటు ప్రాముఖ్యత జోడిస్తూ కుటుంబకథా చిత్రంగా ఈ సినిమాని మలిచి దర్శక నిర్మాతలకు అభినందనలు. ఇందులో నేను కీలక పాత్రలో నటించాను. హృతిక్ శౌర్యమ హీరోయిన్ తన్వి కొత్తవారైనప్పటి చాలా అనుభవం వున్న నటుల్లా బాగా నటించారు. సినిమా చాలా బావొచ్చింది. అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ఇందులో వున్నాయి. ఖచ్చితంగా ప్రేక్షకులకు నచ్చుతుందని ఆశిస్తున్నాను.  ఈ ఈవెంట్ లో చిత్ర యూనిట్ సభ్యులు పాల్గొన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రూమర్స్ పై స్పందించిన రాహుల్ సిప్లిగంజ్