Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ జరిగే సంఘటనతో ది ట్రయల్ చిత్రం

Advertiesment
The trail team
, గురువారం, 25 మే 2023 (11:57 IST)
The trail team
ఎస్ఎస్ ఫిల్మ్స్, కామన్ మేన్ ప్రొడక్షన్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మిస్తోన్న చిత్రం 'ది ట్రయల్'. స్పందన పల్లి, యుగ్ రామ్, వంశీ కోటు ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రానికి రామ్ గన్నీ దర్శకుడు. స్మృతి సాగి, శ్రీనివాస్ కే నాయుడు నిర్మాతలు. లేటెస్ట్ గా ఈ మూవీ టీజర్ ను పుష్ప  రచయిత శ్రీకాంత్ విస్సా, నటుడు, సంగీత దర్శకుడు రఘు కుంచె, పలాస ఫేమ్ రక్షిత్  అట్లూరి చేతుల మీదుగా విడుదల చేశారు.
 
ఈ సందర్భంగా దర్శకుడు రామ్ గన్నీ మాట్లాడుతూ, ఈ కథ కంటే ముందు నిన్ను నమ్ముతున్నాను అని. మధ్యలో కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా.. ఆయన రిస్క్ తీసుకుని సినిమా స్టార్ట్ చేశారు. ఓ దర్శకుడుగా నిర్మాత నమ్మకాన్ని వమ్ము చేయకుండా తీశాను. మా రెండో ప్రొడ్యూసర్ నాయుడుగారు కూడా ఈ సినిమాను తన భుజాలపై మోశారు. ఈ కథ గురించి చెప్పాలంటే.. లేడీ ఓరియంటెడ్ కథ ఓ మహిళ, ఆమె భర్త చుట్టూ  జరిగే ఓ కాన్ స్పిరసీ. ఒక సంఘటన జరుగుతుంది. ఆ సంఘటన చుట్టూ కథనం సాగుతుంది. హీరోయిన్ పాత్ర కోసం చాలామందిని చూసిన తర్వాత స్పందనను చూడగానే ఓకే చేశాం. వర్క్ షాప్ కూడా లేకుండానే సెట్స్ పైకి వెళ్లాం. షూటింగ్ కు ముందు ఒక సీన్ చేయిస్తే వెంటనే చేసింది. ఆ ధైర్యంతోనే షూటింగ్ కు వెళ్లాం. ఎప్పుడూ తనతో ప్రాబ్లమ్ రాలేదు. ఇక నా డైరెక్షన్ టీమ్ చాలా చాలా సపోర్ట్ చేసింది.. " అన్నారు..
 
పుష్ప రచయిత శ్రీకాంత్ విస్సా మాట్లాడుతూ .. " టీజర్ చాలా బావుంది. నాకు బాగా నచ్చింది. మళయాలంలో ఎన్నో ఇంటరాగేషన్ ఫిల్మ్స్ వస్తుంటాయి. మన తెలుగులో ఆ జానర్ ఎందుకు లేదు అనుకుంటాను. ఈ టీజర్ చూస్తే ఆ జానర్ లో ఉంది. లైఫ్ లో కొన్ని కో ఇన్సెడెంట్స్ వర్కవుట్ అవుతాయి. ఈ చిత్రానికి అన్ని కో ఇన్స్ డెన్సెస్ వర్కవుట్ కావాలని కోరుకుంటూ ఎంటైర్ టీమ్ కు ఆల్ ద బెస్ట్... " అన్నారు.
 
హీరోయిన్ స్పందన మాట్లాడుతూ.. " ఇక్కడికి వచ్చిన చీఫ్‌ గెస్ట్ లందరికీ థ్యాంక్యూ. మీరు రావడంతో చాలా పాజిటివ్ గా అనిపించింది. నేను వందసార్లు మోటివేషనల్ స్పీకర్ గా మాట్లాడినా.. కానీ ఇక్కడ షివరింగ్ వస్తోంది. ఇది ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ. ప్రతి హీరోయిన్ ఇలాంటి పాత్ర చేయాలనుకుంటుంది. దర్శకుడు రామ్ గారు చాలా మంచి వారు. ఇంటికి వచ్చి స్టోరీ చెప్పారు. థ్రిల్లర్ సినిమా అయినా చాలా ఫన్ గానూ ఉంటుంది. ఇలాంటి పాత్ర ఇచ్చిన దర్శకుడికి థ్యాంక్యూ సోమచ్. అలాగే మా ప్రొడ్యూసర్స్ చొరవ చూపకపోతే ఈ ప్రాజెక్ట్ లేదు. మా డివోపి చాలా టార్చర్ పెట్టాడు. చాలా ఫన్ గా ఉంటాడు. రోజంతా షూటింగ్ చేసినా ఎప్పుడూ అలసిపోలేదు. ఎక్కువ షూటింగ్ అంతా వైజాగ్ లోనే బ్యూటీఫుల్ లొకేషన్స్ లో చేశాం. ప్రతి ఒక్కరికీ థ్యాంక్యూ సో మచ్.. " అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పై టైగర్ నాగేశ్వరరావు దోపిడీని తలపించేలా ఫస్ట్-లుక్ లాంచ్