Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

రాజమండ్రి గోదావరి బ్రిడ్జ్ పై టైగర్ నాగేశ్వరరావు దోపిడీని తలపించేలా ఫస్ట్-లుక్ లాంచ్

godavari bridge tiger look
, గురువారం, 25 మే 2023 (11:11 IST)
godavari bridge tiger look
రవితేజ నటిస్తున్న టైగర్ నాగేశ్వరరావు  ఫస్ట్-లుక్ లాంచ్ రాజమండ్రిలోని ఐకానిక్ హేవ్‌లాక్ బ్రిడ్జ్  (గోదావరి) వద్ద వినూత్నంగా విడుదల చేశారు. 1970 దశకములో ఇక్కడే రైల్ దోపిడీలు జరిగేవి అని.. అందుకే ఆ తరహాలో లుక్ లాంచ్ ప్లాన్ చేశామని, ఈ సినిమాకు సంబందించిన ట్రైన్ రోబోరి సీన్ ఇక్కడే తీశామని డైరెక్టర్ వంశీ తెలిపారు. 'టైగర్ నాగేశ్వరరావు’ మాకు చాలా స్పెషల్ మూవీ అని  నిర్మాత అభిషేక్ అగర్వాల్ తెలిపారు. 
 
ది కాశ్మీర్ ఫైల్స్, కార్తికేయ 2, ఇప్పుడు టైగర్ నాగేశ్వరరావు. పాన్ ఇండియా లెవల్ బ్లాక్ బస్టర్స్ అందించిన అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్, దక్షిణాది తో పాటు ఉత్తరాది ప్రేక్షకులకు సుపరిచితమైన మాస్ మహారాజా రవితేజ టైటిల్ రోల్ పోషిస్తున్న మరో పాన్ ఇండియా ప్రాజెక్ట్ 'టైగర్ నాగేశ్వరరావు తో వస్తోంది. ఈ చిత్రానికి  వంశీ దర్శకత్వం వహించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్‌పై అభిషేక్ అగర్వాల్ గ్రాండ్‌గా నిర్మించారు. ఈ చిత్రం ప్రమోషన్‌ లు వినూత్న పద్ధతిలో ప్రారంభమయ్యాయి. మేకర్స్ ఫియర్స్ & మెజెస్టిక్ ఫస్ట్-లుక్ పోస్టర్, ఆసక్తికరమైన కాన్సెప్ట్ వీడియోను విడుదల చేశారు. 
 
ఫస్ట్‌ లుక్ పోస్టర్‌ లో రవితేజ ఫెరోషియస్ టైగర్ లా రగ్గడ్ గెటప్‌ లో కనిపించారు. ఇది కేవలం పోస్టర్ అయినప్పటికీ అతని కళ్ళలోకి చూడాలంటే భయంగా ఉంది. రవితేజ బార్స్ వెనుక ఇంటెన్స్ లుక్ లో కనిపిస్తున్నారు. టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసేలా కాన్సెప్ట్ పోస్టర్ ఉంది. ఇది ఐదు వేర్వేరు భాషల్లో ఐదుగురు సూపర్ స్టార్‌ ల వాయిస్‌ ఓవర్‌ లతో అద్భుతంగా ప్రజంట్ చేశారు. తెలుగు వెర్షన్‌కి వెంకటేష్ వాయిస్ ఓవర్ ఇవ్వగా, జాన్ అబ్రహం, శివ రాజ్‌కుమార్, కార్తీ, దుల్కర్ సల్మాన్ వరుసగా హిందీ, కన్నడ, తమిళం , మలయాళ భాషలలో టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేశారు.
 
వీడియో ప్రారంభంలో చెప్పినట్లుగా, కథ నిజమైన రూమర్స్ నుండి ప్రేరణ పొందింది. ''అది 70వ దశకం. బంగాళాఖాతం తీర ప్రాంతంలోని ఓ చిన్న గ్రామం. ప్రపంచాన్ని భయపెట్టే చీకటి కూడా అక్కడి జనాల్ని చూసి భయపడుతుంది. దడదడ మంటూ వెళ్ళే రైలు ఆ ప్రాంత పొలిమేర రాగానే  గజగజ వణుకుతుంది. ఆ ఊరు మైలు రాయి కనపడితే జనం అడుగులు తడబడతాయి. దక్షిణ భారతదేశపు నేర రాజధాని. ది క్రైమ్‌ క్యాపిటల్‌ అఫ్ సౌత్ ఇండియా.. స్టువర్ట్ పురం. ఆ ప్రాంతానికి ఇంకో పేరు కూడా వుంది. టైగర్‌ జోన్‌... ది జోన్ అఫ్ టైగర్ నాగేశ్వరరావు..” అంటూ వాయిస్‌ ఓవర్‌ టైగర్ నాగేశ్వరరావు ప్రపంచాన్ని పరిచయం చేసింది. 
ఫస్ట్ లుక్ లాంచ్ ఈవెంట్ దర్శకుడు వంశీ మాట్లాడుతూ.. ఫస్ట్ లుక్ ని ఇంత గ్రాండ్ గా లాంచ్ చేసిన నిర్మాతలుకు కృతజ్ఞతలు. ఇలాంటి ఈవెంట్స్ ఇంకా చాలా వున్నాయి. రవితేజ గారి అభిమానులకు, ప్రేక్షకులకు, మీడియాకి, అందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు. రవితేజ గారి అభిమానులు ఆకలి తీరేలా ఈ సినిమా వుంటుంది. రవితేజ గారి బ్లెసింగ్స్ మనకీ ఎప్పుడూ వుంటాయి. నువ్వు చెయ్ వంశీ నేను వున్నాని చెబుతుంటారు. ఈ సినిమా చాలా బాగా ఆడుతుందని నమ్ముతున్నాను. అక్టోబర్ 20న సినిమాని మిస్ కావద్దు’’ అన్నారు.
 
నిర్మాత అభిషేక్ అగర్వాల్ మాట్లాడుతూ. కొన్ని దారి రాస్తుంది. కొన్ని నేను రాస్తాను .వాళ్ళు కష్టాలు రాస్తూ ఉంటారు. నేను గమ్యం రాసేస్తాను. నా రెక్కలు మీరు కోసేసిన నేలపై వుండి నింగిని రాసేస్తాను’’ ఇదీ మా టైగర్ నాగేశ్వరరావు;; అన్నారు  

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

టాలీవుడ్ హీరో వేధించాడా.. ఆ వార్తల్లో నిజం లేదు.. హన్సిక