Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

విశ్వక్ సేన్ - గామి ఫస్ట్ లుక్ విడుదల

Advertiesment
Vishwak Sen, Gami First Look

డీవీ

, సోమవారం, 29 జనవరి 2024 (06:05 IST)
Vishwak Sen, Gami First Look
మాస్ క దాస్ విశ్వక్ సేన్ యూనిక్‌ కాన్సెప్ట్‌లతోనూ ప్రయోగాలు చేస్తున్నారు. విద్యాధర్ కాగిత దర్శకత్వంలో విశ్వక్ సేన్ చేస్తున్న ప్రతిష్టాత్మక చిత్రం  'గామి'.  కార్తీక్ కుల్ట్ క్రియేషన్స్‌పై కార్తీక్ శబరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ అడ్వెంచర్ డ్రామాని వి సెల్యులాయిడ్ సమర్పిస్తోంది. ఈ చిత్రానికి క్రౌడ్ ఫండ్ చేశారు.
 
తాజాగా మేకర్స్ హైదరాబాద్ కామిక్ కాన్‌లో ఈ చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ ద్వారా ప్రమోషన్‌లను ప్రారంభించారు. అఘోరా గెటప్‌లో విశ్వక్ సేన్ ఆశ్చర్యపరిచారు. చుట్టూ చాలా మంది అఘోరాలు అతనిని తాకడానికి ప్రయత్నిస్తారు. పోస్టర్  టెర్రిఫిక్ గా వుంది. డార్క్ మిస్టీరియస్ ఫీలింగ్ ని కలిగిస్తోంది. ఆడియన్స్ లో చాలా క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంది.
 
'ఈ చిత్రంలో విశ్వక్ సేన్ 'శంకర్' అనే అఘోరాగా కనిపించనున్నారు. తనకి చాలా రేర్ కండీషన్ వుంటుంది. అతను ఏ మానవ స్పర్శను అనుభవించలేడు' అని మేకర్స్ అనౌన్స్ చేశారు. పోస్టర్‌పై “His biggest fear, is human touch… His deepest desire, is also human touch”  అనే ట్యాగ్‌లైన్ వుంది. ఇది ఆ పాత్ర భావోద్వేగ సంఘర్షణ యొక్క లోతును తెలిజేస్తుంది. దర్శకుడు విద్యాధర్ మాట్లాడుతూ, “ఈ చిత్రంలో అఘోరా సెటప్‌తో పాటు, రెండు విభిన్నమైన సెటప్‌లు,  ఇతర పాత్రలు ఉన్నాయి. ప్రమోషన్స్ లో వాటి గురించి రివిల్ చేస్తాం''అన్నారు  
 
ఈ చిత్రంలో కలర్ ఫోటో ఫేమ్ చాందిని చౌదరి కథానాయికగా నటిస్తుండగా, ఎం జి అభినయ, హారిక, మహ్మద్ సమద్ ముఖ్య తారాగణం.
 
ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ విశ్వనాథ్ రెడ్డి, రాంపీ నందిగాం అందిస్తున్నారు. నరేష్ కుమారన్ మ్యూజిక్.  విద్యాధర్ కాగిత, ప్రత్యూష్ వత్యం  స్క్రీన్ ప్లే సమకూరుస్తున్నారు.
 
త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని అనౌన్స్ చేయనున్నారు మేకర్స్.
 
తారాగణం:- విశ్వక్ సేన్, చాందిని చౌదరి, M G అభినయ, హారిక పెడదా, మహ్మద్ సమద్

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రముఖ బెంగాలీ హీరోయిన్ శ్రీల కన్నుమూత