Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

నటనలో కాన్ఫిడెన్స్ ఇచ్చిన తాజుద్దీన్ తీస్తున్న #CULT హిలేరియస్ గా వుంటుంది : విశ్వక్ సేన్

Advertiesment
Tajuddin, Vishwak Sen
, శనివారం, 30 డిశెంబరు 2023 (19:50 IST)
Tajuddin, Vishwak Sen
మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మల్టీ ట్యాలెంటెడ్. హీరోగా వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులని అలరిస్తున్న విశ్వక్ ఫలక్‌నుమా దాస్, దాస్ కా ధమ్కి చిత్రాలకు రచన, దర్శకత్వం వహించి స్వయంగా నిర్మించారు. యంగ్ ట్యాలెంట్ ని ప్రోత్సహించడానికి తన హోమ్ బ్యానర్లు వన్మయే క్రియేషన్స్, విశ్వక్సేన్ సినిమాస్‌లో చిత్రాలను నిర్మించాలని నిర్ణయించుకున్నారు.
 
25 మంది కొత్త యాక్టర్స్ పరిచయం చేస్తూ తన కొత్త ప్రొడక్షన్ వెంచర్‌3ని తాజాగా అనౌన్స్ చేశారు విశ్వక్. ఈ చిత్రానికి #CULT అనే  పవర్ ఫుల్  టైటిల్ పెట్టారు. లైక్ ఎ లీప్ ఇయర్ 2024 అనేది ట్యాగ్‌లైన్‌. సే నో టు డ్రగ్స్ అనే స్లొగన్ మరింత ఆసక్తికరంగా వుంది. టైటిల్ పోస్టర్లో డ్రగ్స్ ట్యాబ్లెట్లు, పౌడర్ల రూపంలో కనిపిస్తున్నాయి. కామెడీ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి కథను అందించిన విశ్వక్సేన్, తాజుద్దీన్ ని దర్శకుడిగా పరిచయం చేస్తున్నారు.
 
ప్రొడక్షన్ లాంచ్ ప్రెస్ మీట్ లో మాస్ కా దాస్ విశ్వక్ సేన్ మాట్లాడుతూ.. నిజంగా జరిగిన సంఘటన నుంచి స్ఫూర్తి పొంది #CULT కథని రాశాను. ఈ చిత్రంతో తాజుద్దీన్ గారిని దర్శకుడిగా పరిచయం చేస్తున్నాను. తాజుద్దీన్  నాకు ఎప్పటినుంచో తెలుసు. నేను ముంబై యాక్టింగ్ స్కూల్ కి వెళ్ళకముందు ఆయన నాకు యాక్టింగ్ నేర్పించేవారు. నటనలో నాకు చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చారు. ఇందులో ముగ్గురు అబ్బాయిలు,. ముగ్గురు అమ్మాయిలు లీడ్ పాత్రల్లో వుంటారు. ఈ చిత్రం ద్వారా 25 మంది కొత్త యాక్టర్స్ ని పరిచయం చేస్తున్నాం. ఔత్సాహికులు ఆడిషన్ వీడియోలు సెండ్ చేయొచ్చు. దానికి సంబధించిన పోస్టర్ కూడా విడుదల చేస్తున్నాం. సినిమా అంటే నాకు ప్యాషన్. ఇది నాకు ఆనందాన్ని ఇస్తుంది. #CULT  సినిమా చాలా హిలేరియస్ గా ఉండబోతుంది. ఒక మంచి సందేశం కూడా వుంటుంది'' అన్నారు
 
దర్శకుడు తాజుద్దీన్  మాట్లాడుతూ.. ఇది నాకు మొదటి చిత్రం. విశ్వక్ గారు ఈ సినిమా కథ చెప్పినపుడు చాలా థ్రిల్లింగ్ గా అనిపించింది. విశ్వక్ గారికి ధన్యవాదాలు'' తెలిపారు.
 
#CULT చిత్రం త్వరలో ప్రారంభం కానుంది. నటీనటులు, టెక్నికల్ టీం వివరాలు మేకర్స్ త్వరలోనే తెలియజేస్తారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

సందేశం, వినోదం కలిసి సినిమా సర్కారు నౌకరి ; మూవీ టీమ్