Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మహిళలు సెట్ లో ఉంటే అబ్బాయిలకు మోటివేషన్ ఉంటుంది : విశ్వక్ సేన్

Vishwak Sen, Priyadarshi, Thiruveer, Abhay Naveen, Amulya Reddy
, మంగళవారం, 12 సెప్టెంబరు 2023 (16:34 IST)
Vishwak Sen, Priyadarshi, Thiruveer, Abhay Naveen, Amulya Reddy
నా సినిమా ప్రదర్శించే థియేటర్ దగ్గరకు వెళ్లి టికెట్ మీద ఆ సినిమా పేరు చూడాలనుకు నేవాడిని. ఈ నగరానికి ఏమైంది సినిమా రిలీజ్ అయినప్పుడు దేవి థియేటర్ కు వెళ్లి వంద టికెట్స్ కొని వాటిని చూసుకుని సంతోషపడ్డాను. మా ఫలక్ నుమా దాస్ సినిమా ఆడిషన్ కు అభయ్ వచ్చాడు. అప్పుడు ఆడిషన్ కు వచ్చిన వారిలో అభయ్ సీనియర్. సీనియర్ అని జాగ్రత్తగా ఆడిషన్ తీసుకున్నా.. అని హీరో విశ్వక్ సేన్ అన్నారు.
 
యాక్టర్ అభయ్ నవీన్ హీరోగా నటిస్తూ దర్శకత్వం వహించిన సినిమా “రామన్న యూత్”. ఎంటర్ టైనింగ్ పొలిటికల్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని ఫైర్ ఫ్లై ఆర్ట్స్ సంస్థ నిర్మించింది. “రామన్న యూత్” సినిమా ఈ నెల 15న విడుదలకు సిద్ధమవుతోంది. సోమవారం సాయంత్రం ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్ కా దాస్ విశ్వక్ సేన్, ప్రియదర్శి, తిరువీర్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా విశ్వక్ సేన్ మాట్లాడుతూ, చరిత్ర సృష్టించే సినిమాలకు బడ్జెట్ ఇంత ఉండాలనే అవసరం లేదు అని పెళ్లి చూపులు, అర్జున్ రెడ్డి, బలగం, మసూద, ఫలక్ నుమా దాస్ వంటి ఎన్నో సినిమాలు ప్రూవ్ చేశాయి. సినిమాకు ఎంత బడ్జెట్ పెట్టామనేది చూస్తుంటారు చాలా మంది కానీ..ఆ సినిమా వెనక పనిచేస్తున్న వాళ్లు ఎంత టాలెంటెడ్ అనేది చూస్తే అది సినిమాకు అసలైన స్ట్రెంత్ అని నమ్ముతాను. రామన్న యూత్ కు అలాంటి మ్యాజిక్ వర్కవుట్ అవ్వాలని కోరుకుంటున్నా. పొలిటికల్ నాలెడ్జ్ రూరల్ యూత్ కు ఎక్కువగా ఉంటుంది. క్రికెట్, పొలిటికల్ నాలెడ్జ్ వారికే ఎక్కువ ఉంటుంది. అలాంటి ఫ్లేవర్ ఈ సినిమాలో తీసుకొచ్చాడు అభయ్. ఈ సినిమాకు డైరెక్షన్ డిపార్ట్ మెంట్ లో  కొంతమంది మహిళలు పనిచేశారని విన్నాను. అమ్మాయిలు ఇండస్ట్రీకి రండి. బాలీవుడ్ లో చాలా మంది వుమెన్ సినిమాకు వర్క్ చేస్తారు. మీరు సెట్ లో ఉంటే అబ్బాయిలకు మోటివేషన్ ఉంటుంది. తరుణ్ భాస్కర్ ఏడాదిన్నర క్రితమే ఈ కథ గురించి చెప్పాడు చాలా బాగుందని. చాలా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఇది. హోల్ టీమ్ కు ఆల్ ది బెస్ట్ చెబుతున్నా. ఈ నెల 15న రామన్న యూత్ సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుంది. అన్నారు.
 
కో ప్రొడ్యూసర్ శివ మాట్లాడుతూ - మా ఫ్రెండ్ సర్కిల్ లో సినిమాల గురించే ఎక్కువ డిస్కషన్స్ చేస్తుంటాం. కాంపాక్ట్ బడ్జెట్ లో మూవీస్ చేయడం ఎలా అనేది ఆలోచించేవాళ్లం. అలా వచ్చిన కొన్ని సినిమాలను అబ్సర్వ్ చేశాం. అలాంటి టైమ్ లో కత్తి మహేశ్ ద్వారా అభయ్ నవీన్ పరిచయం అయ్యాడు. అతను చెప్పిన కథ విన్నాక...ఒక యూనిక్ పాయింట్ ను సినిమాటిక్ వేలో బాగా కథ రాశాడు అనిపించింది. కానీ మేకింగ్ మేము అనుకున్నంత ఈజీగా కాలేదు. మంచి సినిమా చేశామని చెప్పగలను. మీరు చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. అన్నారు
 
హీరో, దర్శకుడు అభయ్ నవీన్ మాట్లాడుతూ - సినిమా తీయాలనేది నా కల. నా పట్టుదల చూశాక ఫ్రెండ్స్, ఫ్యామిలీ ఎంతో సపోర్ట్ చేయడం ప్రారంభించారు. వీళ్లంతా నన్ను నమ్మకపోతే నేను సినిమా చేయగలిగే వాడిని కాదు. బొమ్మలరామారం సినిమా టైమ్ నుంచి ప్రియదర్శి, తిరువీర్ పరిచయం. ప్రియదర్శి చెబితే పెళ్లి చూపులు ఆడిషన్స్ వెళ్లా. డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పినా నేను నమ్మలేదు. కానీ ఆ సినిమాలో అవకాశం వచ్చింది. ఇప్పటికీ నన్ను కొందరు పెళ్లి చూపులు సినిమాలోలాగ యూకలిప్టస్ అని పిలుస్తుంటారు. అభయ్ అని కొందరు, నవీన్ అని కొందరు అంటారు. నా వెనక ప్రియదర్శి, తిరువీర్, తరుణ్ భాస్కర్, జీవన్ రెడ్డి, పవన్ సాధినేని లాంటి వాళ్లంతా ఉన్నారనే ధైర్యంతో రామన్న యూత్ స్టార్ట్ చేశాను.  మంచి సినిమా చేశామనే ధైర్యాన్ని మాకు మొదట ఇచ్చింది సిల్లీ మాంక్స్ అనిల్ అన్న. మా సినిమాకు ఇలా ప్రీ రిలీజ్ చేసి, రిలీజ్ డేట్ అనౌన్స్ చేసుకోవడమే పెద్ద సక్సెస్. ప్రేక్షకులకు చిన్న సినిమా పెద్ద సినిమా అనేది తెలియదు. మంచి కథ ఉంటే సినిమా తప్పకుండా చూస్తారు. ఈ నెల 15 నా లైఫ్ లో స్పెషల్ డే. ఆ రోజును మా నాన్నకు అంకితఇస్తా. ఇక రామన్న యూత్ సినిమా మీ చేతుల్లోకి వచ్చేసింది. ట్రైలర్ నచ్చితే అందరికీ షేర్ చేయండి. మా సినిమాను థియేటర్ లో చూసి ఎంకరేజ్ చేయండి. అన్నారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నెక్ట్ ఏం జరుగుతుందనే ఇంట్రెస్ట్ క్రియేట్ చేసేలా అతిథి సిరీస్ ఉంటుంది : అవంతిక మిశ్రా