Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

మళ్ళీ లుంగీ కట్టుకుని కత్తి పట్టుకోవాలని ఉంది : విశ్వక్ సేన్

Vishwak Sen
, బుధవారం, 22 నవంబరు 2023 (16:10 IST)
Vishwak Sen
ఆజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ నటించిన సినిమా 'మంగళవారం'.. పాయల్ బాగా చేశారు. ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమాను ఇంత క్వాలిటీగా తీయాలంటే నిర్మాతలు దొరకడం తక్కువ. నిర్మాతలకు హ్యాట్సాఫ్. ప్రియదర్శి ఏం నక్క తోక తొక్కాడో తెలియదు అని విశ్వక్ సేన్ అన్నారు. సినిమా సక్సెస్ సెలబ్రేషన్స్‌లో ఆయన మాట్లాడారు.
 
ఇంకా విశ్వక్ సేన్ మాట్లాడుతూ ''హీరోయిన్‌ను హీరో చేస్తాడు. రోల్ ఇచ్చి మాస్క్ వేస్తాడు కానీ ముఖం చూపించడు. దర్శకుడ్ని ఐటెం డ్యాన్సర్ చేస్తాడు. నెక్స్ట్ నేను సినిమా చేస్తే అజయ్ భూపతి నన్ను ఏం చేస్తాడో!? జోక్స్ పక్కన పెడితే... అజయ్ భూపతి రెండు రోజులు ముందు ఫోన్ చేస్తే ఫోటోలు పంపించేవాడిని. అప్పటికి తరుణ్ భాస్కర్ సినిమాలో అవకాశం వచ్చింది. ఆయన కథ చెబితే సుదర్శన్ థియేటర్లో సినిమా చూస్తున్నట్లు ఉంటుంది. 'మహాసముద్రం' కథ వింటూ పదిసార్లు ఉలిక్కిపడ్డా. డేట్స్ కుదరక అప్పుడు చేయలేదు. లుంగీ కట్టుకుని, కత్తి పట్టుకునే సోకు 'గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి'తో తీరుతుంది. అజయ్ భూపతి నాతో సినిమా చేస్తే మళ్ళీ లుంగీ కట్టుకుని కత్తి పట్టుకోవాలని ఉంది. 'ఆర్ఎక్స్ 100', 'మహాసముద్రం', ఇప్పుడీ 'మంగళవారం'... ఒక్క మాటలో మాట్లాడుకునే పాయింట్ తీసుకుని రెండున్నర గంటలు నిజాయతీగా చెప్పే దర్శకుడు అజయ్ భూపతి. ఆయన దర్శకత్వానికి నేను పెద్ద ఫ్యాన్. త్వరలో సినిమా చేద్దాం! 
 
సాధారణంగా మంచి సినిమాలు చేస్తే... పేరు వస్తే పైసల్ రావు, పైసల్ వస్తే పేరు రాదు. ప్రియదర్శి చేసే సినిమాలకు పేరు, పైసల్ వస్తున్నాయి. 'బ్యాట్ మ్యాన్', 'డంకర్క్' సినిమాల్లో టామ్ హార్డీ ఎక్కువ మాస్క్ తో కనిపిస్తారు. తెలుగులో నేను ఆ టైపు రోల్ చేశానని ప్రియదర్శి చెప్పుకోవచ్చు. టీమ్ అందరికీ క్రాంగ్రాచ్యులేషన్స్'' అని అన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

కోట బొమ్మాళి పీఎస్‌ చిత్రం పొలిటికల్ సెటైర్ కాదు సిస్టమ్ లో జరిగేది చూపించాం : శ్రీకాంత్