''ఫైటర్''గా వచ్చేస్తోన్న #VijayDeverakonda.. హీరోయిన్ ఎవరో తెలుసా? (video)

సోమవారం, 20 జనవరి 2020 (12:09 IST)
డాషింగ్ డైరక్టర్ పూరీ జగన్నథ్ దర్శకత్వంలో ఫైటర్ సినిమా తెరకెక్కుతోంది. ఈ సినిమా యాక్షన్‌ ప్రధానాంశంగా సాగే ఓ ప్రేమ కథతో తెరకెక్కనుంది. ఈ సినిమాలో టాలీవుడ్‌ రౌడీ విజయ్‌ దేవరకొండ హీరోగా నటిస్తున్నాడు. విజయ్- పూరీల కాంబోలో ఈ  కొత్త సినిమా ఆరంభమైంది. ఈ చిత్రం కోసం థాయ్‌లాండ్‌ వెళ్లి మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ఈ చిత్రంలో విజయ్‌ వినూత్నమైన గెటప్‌తో ప్రేక్షకులను అలరించనున్నారు.
 
పాన్‌ ఇండియా స్థాయిలో తెరకెక్కుతోన్న ఈ సినిమా పూజా కార్యక్రమం నేడు ముంబయిలో వేడుకగా జరిగింది. ముహుర్తపు షాట్‌లో భాగంగా ఛార్మి క్లాప్‌ కొట్టారు. ముహుర్తపు షాట్‌కు సంబంధించిన ఫొటోలతో పాటు వీడియోను ఛార్మి ట్విటర్‌ వేదికగా అభిమానులతో పంచుకున్నారు. 
 
ఇక 'ఫైటర్‌' సినిమాలో జాన్వీ కపూర్‌ నటిస్తారని కొన్ని రోజుల క్రితం జోరుగా ప్రచారం జరిగింది. కానీ డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతో ఆమె ఈ ప్రాజెక్టు నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే.. అనన్యను ప్రస్తుతం ఫైటర్ కోసం ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. అనన్య 'స్టూడెంట్ అఫ్ ది ఇయర్ 2'తో బాలీవుడ్‌కు పరిచయమై.. 'పతీ పత్నీ ఔర్ ఓ' సినిమాతో హిట్ కొట్టింది. ప్రస్తుతం 'ఖాలీ పీలి' అనే చిత్రంలో నటిస్తోంది.

IT'S OFFICIAL... Karan Johar and Puri Jagannadh join hands... Their first collaboration - starring #VijayDeverakonda - starts filming in #Mumbai today... Will release in #Hindi and all South Indian languages... Produced by Puri Jagannadh, Charmme Kaur, Karan Johar, Apoorva Mehta. pic.twitter.com/ktcfugABG1

— taran adarsh (@taran_adarsh) January 20, 2020
 

వెబ్దునియా పై చదవండి

తర్వాతి కథనం జనసేన భాజపా పొత్తును స్వాగ తీస్తున్నా : కృష్ణంరాజు