Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

జనసేన భాజపా పొత్తును స్వాగ తీస్తున్నా : కృష్ణంరాజు

webdunia
ఆదివారం, 19 జనవరి 2020 (17:21 IST)
దాదాపు 350కిపైగా చిత్రాల్లో నటించి సినీప్రియుల మదిలో రెబల్‌స్టార్‌గా పేరు తెచ్చుకోవడమే కాక, నిర్మాతగానూ పదుల సంఖ్యలో హిట్‌ చిత్రాలు నిర్మించి తన అభిరుచిని చాటుకున్నారు రెబల్ స్టార్ కృష్ణంరాజు. ఈనెల 20న ఆయన జన్మదినం. ఆయన 80వ పుట్టిన రోజుని పురస్కరించుకుని రెండు రోజుల ముందుగానే శనివారం హైదరాబాద్‌ ఎఫ్‌ఎన్‌సిసిలో ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఆధ్వర్యంలో బర్త్‌డే సెలబ్రేషన్ జరిగాయి. సతీసమేతంగా హాజరైన కృష్ణంరాజు కేక్ కట్ చేసి తన ఆనందాన్నిపంచుకున్నారు.
 
ఈ సందర్భంగా, రెబల్ స్టార్ కృష్ణంరాజు మాట్లాడుతూ, నాకు స్నేహితులను చేసుకునే వ్యసనంఉంది. ఫ్రెండ్స్‌ని చూసినప్పుడు ఎంతో ఆనందంగా అనిపిస్తుంటుంది. మా నిర్మాణ సంస్థ గోపీకృష్ణ మూవీస్‌కు ప్రేక్షకుల్లో మంచి ఇమేజ్‌ ఉంది. ఆ బేనరులో అనేక గొప్ప సినిమాలను నిర్మించి, నటించాను. 'బొబ్బిలి బ్రహ్మన్న, కృష్ణవేణి', 'అమర దీపం',
'మనవూరి పాండవులు' వంటి చిత్రాలు చేశా 'తాండ్రపాపారాయుడు' చిత్ర సమయంలో ఐదువేల మందితో యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించాం. క్లిష్ట పరిస్థితుల్లో అంత మందితో చిత్రీకరించడంతో నా బలం, నాలోని శక్తి ఏంటో తెలిసింది. అది చూసి ఎంతో ఆనంద పడ్డాను. 
 
మా సంస్థ నుంచి ఓ సినిమా వస్తుందంటే ప్రేక్షకుల్లో మంచి అంచనాలుంటాయి. ఇప్పుడు మా నుంచి రాబోతున్న ప్రభాస్‌ కొత్త చిత్రాన్ని అంచనాలకు తగ్గట్టు రూపొందుతుంది అన్నారు. తండ్రిని మించిన తనయుడు.. గురువును మించిన శిష్యుడు అంటుంటారు కదా. ప్రభాస్‌ కూడా అలాంటి వాడే. నేను హీరోగా తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ సీమల్లో గుర్తింపు తెచ్చుకున్నా. కానీ, ప్రభాస్‌ ఏకంగా దేశవ్యాప్తంగానే కాక ప్రపంచ దేశాల్లోనూ తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపుని, అభిమాన గణాన్ని సృష్టించుకున్నాడు.
 
నేనూ ఈ చిత్రంలో ఓ కీలక పాత్రనుl పోషిస్తున్నా.. 
ప్రతి తండ్రి తన కొడుకు ఎదగాలని కోరుకుంటాడు.. తప్ప తన తనయుడి చేతిలో ఓడిపోవాలని కోరుకోరు. నేనూ అంతే. ఈ కృష్ణంరాజు ఎప్పుడూ ఓటమిని అంగీకరించడు (నవ్వుతూ). ఎందుకంటే ఓటమన్నది నా జీవితంలోనే లేదు. ఇక రాజకీయాల విషయానికొస్తే.. ఇప్పటికైతే రాజకీయంగా నాకంటూ సొంత ఉద్దేశాలు లేవు. పార్టీ పెరిగితే నేను పెరిగినట్లే. వాజ్‌పేయి ప్రభుత్వం హీరోగా ఉన్న నన్ను కేబినెట్‌ మంత్రిని చేసింది. వాళ్లు నాకిచ్చిన ఈ గౌరవాన్ని నేనూ నిలబెట్టుకున్నా. జనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ భాజపాతో పొత్తు పెట్టుకోవడాన్ని స్వాగతిస్తున్నా. ఇది శుభపరిణామం. సిద్ధాంతాలు కలుపుకోని ప్రజలకు సేవ చేయాలని అనుకున్నంత కాలం ఐదు కోట్ల మంది ఆంధ్రులకు అంతా మంచే జరుగుతుంది’’ అన్నారు. 

Share this Story:

Follow Webdunia Hindi

తర్వాతి కథనం

సర్కారీ స్కూల్ పిల్లలకు ఇంగ్లీష్ పాఠాలు చెప్పిన లక్ష్మీ మంచు