Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

తెలుగు చిత్రపరిశ్రమలో విషాదం... అలనాటి నటి కృష్ణవేణి ఇకలేరు

Advertiesment
krishnaveni

ఠాగూర్

, ఆదివారం, 16 ఫిబ్రవరి 2025 (10:02 IST)
అలనాటి సినీ నటి కృష్ణవేణి ఇకలేరు. ఆమె వయసు 102 సంపత్సరాలు. వయసు రీత్యా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె ఆదివారం ఉదయం ఫిల్మ్ నగరంలోని తన నివాసంలో తుదిశ్వాస విడిచారు. కృష్ణవేణి మరణవార్త తెలుసుకుని పలువురు ప్రముఖులు ఆమెకు నివాళులు అర్పిస్తున్నారు.
 
ఏపీలోని రాజమండ్రికి చెందిన కృష్ణవేణి సినిమాలలో అడుగుపెట్టకముందు రంగస్థల నటిగా ఉన్నారు. 1936లో సతీ అనసూయ చిత్రంతో బాలనటిగా సినీ రంగ ప్రవేశం చేసింది. ఆ తర్వాత కథానాయికగా తెలుగులో 15కు పైగా చిత్రాల్లో నటించారు. కొన్ని తమిళ, కన్నడ, భాషా చిత్రాల్లో కూడా హీరోయిన్‌గా నటించారు. 
 
1949లో తెలుగులో చిత్రపరిశ్రమలో ఓ మైలురాయిగా నిలిచిపోయి మనదేశం వంటి చిత్రాన్ని నిర్మించి, అందులో తెలుగు తెరకు దివంగత నటుడు, సీనియర్ ఎన్టీఆర్‌ను, ఎస్వీ రంగారావును, సినీ నేపథ్యం గాయకుడు ఘంటసా వేంకటేశ్వర రావును వెండితెరకు పరిచయం చేశారు. ఆ తర్వాత అనేక సినిమాలలో గాయకులు, నటీనటులు, సంగీత దర్శకులను పరిచయం చేశారు. 
 
ఇక కృష్ణవేణి నటించిన సినిమాలోల సతీ అనసూయ, మోహినీ రుక్మాంగద, కచదేవయాని, మళ్లీ పెళ్లి, మహానంద, జీవనజ్యోతి, దక్షయజ్ఞం, భీష్ణ, బ్రహ్మారథం, మదాలస, మనదేశం, గొల్లభామ, లక్ష్మమ్మ వంటి చిత్రాలు మంచి గుర్తింపుతో పాటు పేరును సంపాదించిపెట్టాయి. చిత్రపరిశ్రమకు ఆమె చేసిన సేవలకుగాను తెలుగు చిత్రపరిశ్రమలో 2004లో ప్రతిష్టాత్మక రఘుపతి వెంకయ్య అవార్డుతో సత్కరించింది. 


 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

నేను సింగర్‌ని మాత్రమే.. రాజకీయాలొద్దు.. వైకాపాకు పాడినందుకు అవమానాలే.. మంగ్లీ