కోలీవుడ్ నటి వనితా విజయకుమార్ ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆమె అక్క కూతురు అనిత గుండెపోటుతో మరణించింది. ఈ విషయాన్ని వనితా విజయ్ కుమార్ తన ఇన్స్టా ఖాతాలో షేర్ చేసింది.
ఈ ఉదయాన్నే ఈ విషాదకర వార్తతో నిద్రలేచాను.. నా మేనకోడలు అనిత (20) మరణించింది. న్యూఢిల్లీలో సర్జరీ చేసుకున్న తర్వాత ఆమెకు గుండెపొటు రావడంతో ఆమె ప్రాణాలు కోల్పోయింది. నాకు దేవుడిచ్చిన కూతురు తను.. నాకు పెద్ద కూతురు వంటిది.
మా నాన్న సోదరుడి కూతురు ఇంద్ర.. వాళ్లు ప్రస్తుతం సింగపూర్లో ఉంటున్నారు. ఇంద్ర చిన్న కూతురు అనిత. ఇంద్ర అక్క అంటే మా కుటుంబంలో అందరికి ఇష్టం.. అనిత దయాగుణం కలిగి ఉండేది.. అన్నింటిని బాగా అర్థం చేసుకుంటుంది. నాకు ఎప్పుడు మద్దతుగా ఉంటుంది.
అలాగే నన్ను.. నా పిల్లలను చాలా జాగ్రత్తగా చూసుకుంటానని మాటిచ్చింది.. కానీ మమ్మల్ని విడిచిపోయింది. తన తల్లిదండ్రులు సింగపూర్లో ఉండడం వలన తన మృతదేహాన్ని అక్కడికే పంపించాం. ప్రస్తుతం దుబాయ్లో ఉన్నాను. ఇలా జరుగుతుందని అస్సలు ఊహించలేదు. మేము ఈ అక్టోబరులో కలుద్దామనుకున్నాం.
తనను నా దగ్గరే 2 నెలలు ఉంచుకుందామనుకున్నాను. కరోనా లాక్డౌన్ కంటే ముందుగా గత రెండేళ్ల నుంచి కలుద్దామని ప్లాన్ చేస్తున్నాం. కానీ అంతలోనే ఇలా జరిగిపోయింది. నా గుండె బద్ధలైది అంటూ పోస్ట్ చేసింది.