హాలీవుడ్ స్టయిలిష్ విలన్‌గా సుమన్ న్యూలుక్ ఇదే!
, బుధవారం, 24 నవంబరు 2021 (19:34 IST)
నటుడు సుమన్ నటన ప్రత్యేకత శైలి. హీరోగా తన కెరీర్ ఆరంభంనుంచి చేస్తున్న సినిమాలు ఇందుకు నిదర్శనం. అనంతరం రజనీకాంత్ తో శివాజీ సినిమాలో విలన్‌గా ఆయన పోషించిన పాత్ర ఇప్పటికీ ప్రేక్షకులు మర్చిపోలేరు. మంత్రిగా వుండి స్టయిలిష్ గా ఆయన నటించిన నటన అందరికీ ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాలు చేశారు. అయినా మధ్యలో తెలుగులో వస్తున్న ఆఫర్లను అందిపుచ్చుకుని ఆయా పాత్రలకు న్యాయం చేస్తున్నాడు. ఇటీవలే తెలంగాణా దేవుళ్ళులో ఓ పాత్రను పోషించారు. కానీ ఆయనకు తగ్గ పాత్ర మరలా పడలేదు.
తాజాగా అలాంటి పాత్ర ఆయన్ను వెతుకుంటూ వచ్చింది. తమిళంలో స్టయిలిష్‌గా హాలీవుడ్ స్టయిల్‌లో వుండే గెటప్‌తో ఓ పాత్ర పోషిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన స్టిల్స్ బయటకు వచ్చాయి. ఉక్రెయిన్‌లో షూటింగ్ చేస్తున్న స్టిల్స్‌ను చూడొచ్చు. ప్రముఖ నిర్మాణ సంస్థ శరవణ ఫిలింస్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి జెడి. జెర్రీ దర్శకుడు. చెన్నైలో శరవణా స్టోర్స్ అధినేత శరవణన్ తొలి సారిగా నటిస్తూ నిర్మిస్తున్ఆనరు. శరవణన్ సరసన గీతికా తివారీ కథానాయికగా నటిస్తోంది. ప్రభు, విజయ్ కుమార్, నాజర్ , తంబిరామయ్య ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.
తర్వాతి కథనం