Publish Date: Sun, 21 Nov 2021 (10:29 IST)
Updated Date: Sun, 21 Nov 2021 (10:30 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ వేదికగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుకు ఘోర అవమానం జరిగింది. అధికార వైకాపాకు చెందిన వైకాపా ఎమ్మెల్యేలు చంద్రబాబుతో పాటు ఆయన భార్య భువనేశ్వరిని అసభ్యంగా మాట్లాడి హేళన చేశారు. దీంతో కలత చెందిన చంద్రబాబు మీడియా సమావేశంలో కన్నీరుకార్చారు. దీంతో అనేకకు అన్ని వర్గాల నుంచి మద్దతు పెరుగుతోంది.
అదేసమయంలో పలువురు ప్రముఖులు చంద్రబాబుకు ఫోన్ చేసి పరామర్శిస్తున్నారు. ఇలాంటి వారిలో తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ ఒకరు. బాబుకు ఫోన్ చేసిన రజనీకాంత్ పరామర్శించారు.
ఇలాంటి సందర్భాల్లోనే మరింత ధైర్యంగా ఉండాలంటూ హితవు పలికినట్టు సమాచారం. అందేసమయంలో చంద్రబాబుకు పలువురు జాతీయ నేతలు కూడా అండగా నిలుస్తున్నారు. ఏపీ రాజకీయాల్లో ఇలాంటి ఘటనలు జరగడం దురదృష్టకరమని వారు అభిప్రాయపడుతున్నారు.