Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

కదలండి.. బాబు పిలుపు: ముంపు గ్రామాల ప్రజలకు మందులు, ఆహారం

కదలండి.. బాబు పిలుపు: ముంపు గ్రామాల ప్రజలకు మందులు, ఆహారం
, శనివారం, 20 నవంబరు 2021 (17:43 IST)
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు తన అధికారిక ట్విటర్ అకౌంట్‌లో ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సహాయ సహకారాలు అందిస్తున్న వీడియోను పోస్ట్ చేశారు. రాయలసీమలో ముంపునకు గురైన జిల్లాల్లో టీడీపీ కార్యకర్తలు స్వచ్ఛందంగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. విపత్తు సమయాల్లో పని చేయడం ప్రతి కార్యకర్త బాధ్యత అని ఆయన గుర్తు చేశారు. పార్టీ నేతలతో సమీక్షించిన చంద్రబాబు.. త్వరలోనే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్నట్లు వెల్లడించారు. 
 
ఎన్టీఆర్ ట్రస్ట్, ఐటీడీపీ ద్వారా ముంపు గ్రామాల్లో చిక్కుకున్న వారికి మందులు, ఆహారం అందజేసినట్లు ఆయన తెలిపారు. కడప, చిత్తూరు, నెల్లూరు జిల్లాలోని వరద బాధిత ప్రాంతాల్లో ప్రభుత్వ అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్ కూడా ఏరియల్ సర్వే నిర్వహించి.. బాధితులకు వీలైనంత త్వరగా సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

అంగనవాడిలో కలెక్టర్ పిల్లలు.. రాహుల్ రాజ్‌పై ప్రశంసలు