Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

ఎవరికీ భజన చేయను.... నాకు స్పూర్తి చిరంజీవిగారే : 'సంతోషం' సురేష్‌

ఎవరికీ భజన చేయను.... నాకు స్పూర్తి చిరంజీవిగారే : 'సంతోషం' సురేష్‌
, శుక్రవారం, 24 మే 2019 (18:00 IST)
డిస్ట్రిబ్యూటర్‌గా, ఎగ్జిబిటర్‌గా, సంతోషం పత్రిక పబ్లిషర్‌గా, ఫిలింనగర్‌ కల్చరర్‌ క్లబ్‌లో కల్చరల్‌ కమిటీ ఆర్గనైజర్‌గా, 'మా' కార్యవర్గ సభ్యుడు, నిర్మాతగా పలు బాధ్యతలు నిర్వర్తిస్తున్న తనకు చిరంజీవిగారే స్పూర్తని సురేష్‌ కొండేటి తెలియజేస్తున్నాడు. 'ప్రేమిస్తే', 'షాపింగ్‌ మాల్‌, జర్నీ' ఇలా ఆయన తీసిన చిత్రాలను పరిశీలిస్తే ఈ విషయం అర్థమవుతుంది. తాజాగా అంజలీ నటించిన 'లీసా'కు తెలుగు నిర్మాత ఆయనే. ఈనెల 24వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా సురేష్‌ కొండేటి చిత్రం గురించి విలేకరులతో మాట్లాడారు.
 
* 'లీసా'ను చేయడానికి కారణం ఏమిటి?
1985లో చదువుతుండగా 'చిన్నారి చేతన్‌' అనే సినిమా వచ్చింది. త్రీడీలో ఆ సినిమాను చూసి పొంగిపోయా. ఎప్పటికైనా అలాంటి సినిమా చేయాలని అనుకుంటూనే ఉన్నా. అది ఇన్నాళ్ళకు 'లీసా' రూపంలో దక్కింది. తమిళ నిర్మాతలు నన్ను పీఆర్వోగా పెట్టుకుందామని ఫోన్‌ చేశారు. నాకు కాన్సెప్ట్‌ నచ్చి వెంటనే నిర్మాతగా మారిపోయా.
 
* ఏ జోనర్‌లో ఉంటుంది?
హారర్‌ ప్రధానంగా ఉంటుంది. హారర్‌లో కామెడీ కూడా కలగలిసి ఉంటుంది. దాంతో పాటు ఈ సినిమా స్పెషల్‌ సెంటిమెంట్‌. సెంటిమెంట్‌ ప్రధానంగా సాగే సినిమా అవుతుంది. తెలుగు తెరమీద ఫ్రెష్‌గా కూడా ఉంటుంది.
 
* అంజలి ఈ సినిమాను సజెస్ట్‌ చేశారా?
ఇంతకు ముందు 'షాపింగ్‌మాల్‌, జర్నీ'ని తీసుకోమని ఆమె సజెస్ట్‌ చేశారు. ఈ సినిమాను కూడా ఆమె చెప్పారు. దర్శకుడు కూడా తీసుకోమని అనడంతో కథ కూడా నచ్చి తీసుకున్నా.
 
* ఈ మధ్య నటిస్తున్నట్టున్నారు?
'ఎర్రచీర' అనే ఒక సినిమా చేస్తున్నా. ఇక మీద కూడా వరుసగా సినిమాలు చేస్తా. 'మా'లో సభ్యత్వం కూడా ఉంది. 
 
* అన్ని రంగాల్లో పనిచేయడం ఎలా సాధ్యమవుతోంది?
ఎవరికీ భజన చేయను. నాకు చెప్పిన పనిని పర్ఫెక్ట్‌గా చేసుకుంటూ పోతాను. నేను ఒక ఆర్గనైజేషన్‌లో ఉన్నానంటే, నావల్ల అక్కడ అర్ధరూపాయి కూడా నష్టం రాకుండా చూసుకుంటాను. నా వల్ల వీలైనంత సాయం తప్పకుండా చేస్తాను. ఇన్నిటికి టైమ్‌ మేనేజ్‌ చేయడంలో నాకు చిరంజీవిగారే స్ఫూర్తి. చాలా కష్టపడి పనిచేస్తారాయన.
 
* సంతోషం అవార్డులు 18వ ఏట అడుగుపెట్టబోతున్నట్టున్నాయి?
సంతోషం మ్యాగజైన్‌ ప్రారంభోత్సవానికి వచ్చి నాగార్జునగారు మంచి అవార్డులు తెలుగులో రావాలని అంటే వెంటనే నేను మొదలుపెట్టాను. 18 ఏళ్లు నిర్విరామంగా అవార్డులు ఇవ్వడం ఆనందంగా ఉంది.
 
* డిజిటల్‌ మీడియా పెరుగుతున్న ఈ కాలంలోమ్యాగజైన్‌ను నిర్వహించడం ఎలా ఉంది?
అది కష్టమైనా, నష్టమైనా నేను ఉన్నంత కాలం సంతోషం వస్తూనే ఉంటుంది. నేను దాన్ని మానను. దాన్ని మానేస్తే తల్లిని మర్చిపోయినట్టే. ఆ పని నేను చేయను. 
 
* షకలక శంకర్‌తో సినిమా ఎంతవరకు వచ్చింది?
ఎనైటైమ్‌. నేను రెడీగా వున్నా. శంకర్‌తో 'శ్రీకాకుళం' అని ఓ సబ్జెక్ట్‌ అనుకున్నాం. మంచి కథ అది. ఆయన డేట్స్‌ ఇవ్వగానే వెంటనే సెట్‌పైకి వెళుతుంది.
 
* ఎన్ని థియేటర్లలో లీసాను విడుదల చేస్తున్నారు?
దాదాపు 400 థియేటర్లు. మన దగ్గర ప్రతి సెంటర్‌లోనూ త్రీడీ థియేటర్లున్నాయి. లేని చోట్ల 2డీల్లో విడుదల చేస్తాం. చాలా బాగా వచ్చింది సినిమా. చూసిన వాళ్లందరూ ఎంజాయ్‌ చేస్తారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బాలీవుడ్ బ్యూటీ అలియాకు అరుదైన గౌరవం